Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'క్రికెట్ ఆడి చాలా రోజులైంది.. మైదానంలోకి దిగడమే గొప్ప అనుభూతి'

Hardik Pandya said No better feeling than to be back on field

ముంబై: బరిలోకి దిగి చాలా రోజులైంది. మైదానంలోకి దిగడమే గొప్ప అనుభూతి అని టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్‌.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్‌, ట్రైనర్స్‌ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శస్త్రచికిత్స తరువాత నెమ్మదిగా నడవడం ప్రారంభించిన హార్దిక్‌.. ఆ తర్వాత వీల్‌చైర్‌లో తిరిగాడు.

అదే గొప్ప అనుభూతి:

అదే గొప్ప అనుభూతి:

ఇక మునపటిలా పూర్తి ఫిటెనెస్ అందుకోవడానికి ప్రస్తుతం హార్దిక్‌ పాండ్యా మైదానంలో, జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను హార్దిక్‌ తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 'క్రికెట్ ఆడి చాలా రోజులైంది. మైదానంలో బరిలోకి దిగడం కంటే గొప్ప అనుభూతి ఏదీ ఉండదు' అని హార్దిక్‌ ట్వీట్‌ చేశాడు. ట్వీట్ చేసిన కొద్దిక్షణాల్లోనే నెట్టింట్లో ఇది వైరల్‌గా మారింది.

పూర్తి ఫిట్‌నెస్‌ అందుకుంటున్నాడు:

ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ రీట్వీట్‌ చేస్తూ.. 'హార్దిక్‌ కష్టపడుతున్నాడు. తిరిగి పూర్తి ఫిట్‌నెస్‌ అందుకుంటున్నాడు' అని పోస్ట్‌ చేసింది. వెన్ను గాయంతో హార్దిక్‌ పాండ్య దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే విండీస్ సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులోనూ చోటు దక్కలేదు.

సర్జరీ విజయవంతం:

సర్జరీ విజయవంతం:

గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్‌ ఆడుతుండగా హార్దిక్‌ వెన్నునొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. నొప్పి భరించలేక మైదానంలోనే కుప్పకూలిపోవడంతో.. స్ట్రెచర్‌పై తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే గాయం మళ్లీ తిరగబెట్టడంతో పాండ్యాను బీసీసీఐ గత నెలలో సర్జరీ నిమిత్తం లండన్‌కు పంపింది. ఆసియా కప్ తర్వాత తొలిసారి గాయపడినప్పుడు ఎవరైతే డాక్టర్ పాండ్యాకు చికిత్స అందించాడో అదే వైద్యుడు మళ్లీ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

సెర్బియా నటితో ప్రేమాయణం:

సెర్బియా నటితో ప్రేమాయణం:

ఇటీవలి కాలంలో హార్దిక్ క్రికెట్ ఆటకన్నా.. ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా డేటింగ్ విషయాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. గతంలో ఎల్లీ అవ్రామ్, ఊర్వశీ రౌటేలా, ఈషా గుప్తాలతో హార్దిక్ డేటింగ్ చేశాడు. తాజాగా సెర్బియా మోడల్‌, డాన్సర్ నటనా స్టాన్‌కోవిచ్‌తో హార్దిక్‌ ప్రేమాయణం నడుపుతున్నాడు. గతంలో ఎఫైర్లను డేటింగ్‌ వరకే పరిమితం చేసిన హార్దిక్‌.. ఈసారి సీరియస్‌గా స్టాన్‌కోవిచ్‌ను ప్రేమిస్తున్నాడట.

Story first published: Thursday, November 28, 2019, 11:12 [IST]
Other articles published on Nov 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+