Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యా త్రోబ్యాక్ పిక్.. నా సోదరుడు ఏం మారలేదు!!

Hardik Pandyas Throwback Picture With Brother Krunal Oozes Desi Swag

ముంబై : కరోనా వైరస్ మహమ్మారి పంజా విసరడంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడలన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక లాక్‌డౌన్ సందర్భంగా ఆటగాళ్లు అందరూ ఇంట్లోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లలో కొందరు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటే.. మరికొందరు మాత్రం తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఓ త్రోబ్యాక్ పిక్ పోస్ట్ చేసాడు.

2011లో తన సోదరుడు కృనాల్‌ పాండ్యాతో కలిసి దిగిన ఒక ఫోటోను హార్దిక్‌ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో కృనాల్‌ వైట్‌ టీషర్ట్‌లో ఉండగా.. హార్దిక్‌ మాత్రం బ్లాక్‌ టీషర్ట్‌, మెడలో చైన్, కళ్లకు గాగుల్స్‌తో పెట్టుకుని కొత్తగా కనిపించాడు. ఈ ఫోటోకు 'త్రో బ్యాక్‌ టు 2011.. స్వాగ్‌ మేరా దేశ్‌ హై విత్‌ కృనాల్‌ పాండ్యా' అనే క్యాప్షన్‌ హార్దిక్‌ జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు.

ఈ పోస్టుకు కృనాల్‌ పాండ్యా స్పందించాడు. 'కాలం ఎంతలా మారిపోయింది. అప్పటిరోజులు తలచుకుంటే మళ్లీ అప్పటి కాలానికి వెళ్లిపోవాలనిపిస్తుంది. నా సోదరుడు హార్ధిక్‌ అప్పుడు ఎంత స్టైల్‌గా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు' అని కృనాల్‌ చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో హార్ధిక్‌ తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటాడు. కరోనాతో ఆటకు విరామం దొరకడంతో తన వాళ్లతో సంతోషంగా గడుపుతున్న మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకుంటున్నాడు.

ఏప్రిల్‌ మొదటివారంలో సోదరుల దినోత్సవం సందర్భంగా కృనాల్‌, తన సోదరులతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. తనకు కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవి​క్‌తో సరదాగా గడిపిన వీడియోలతో పాటు తన వర్కౌట్‌ వీడియోలను కూడా షేర్‌ చేశాడు. ఇటీవలే నటాషాకు హిందీ నేర్పిస్తున్న హార్ధిక్‌.. ఓ సరదా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలో భాగంగా దుబాయ్‌ వెళ్లిన నటాషా-హార్దిక్.. అక్కడే నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్ధం సమయంలో హార్థిక్.. నటాషాకు ఓ రింగ్‌ను కూడా బహూకరించాడు.

గతేడాది సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ తర్వాత వెన్ను నొప్పితో హార్దిక్‌ పాండ్యా ఆటకు దూరమయ్యాడు. లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సిరీస్‌లకు దూరమయ్యాడు. కివీస్ పర్యటనకు ఎంపికవుతాడనుకున్నా.. పూర్తి ఫిట్‌నెస్‌ లేకపోవడంతో తప్పుకున్నాడు. అయితే దేశవాళీ టోర్నీలో సత్తాచాటాడు. స్టేడియాన్ని సిక్సులతో హోరెత్తించాడు. ఆపై దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇక కరోనా కారణంగా ఐపీఎల్-13 కూడా వాయిదా పడడంతో పునరాగమనం కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

Story first published: Tuesday, April 21, 2020, 19:24 [IST]
Other articles published on Apr 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+