
హైదరాబాద్: భారత క్రికెటర్లు తమ ఆటతీరుతో మైదానంలో పరుగుల వరద పారించడంతో పాటు... బయట కొత్త ట్రెండ్‌లను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. తాజాగా టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమిచ్చాడు.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా తనకు దొరికిన విశ్రాంతిని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో తన కొత్తలుక్‌కి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేయగా అవి వైరల్ అయ్యాయి. 'మార్పు చూసి భయపడకండి. అది మిమ్మల్ని కొత్త ఆరంభాలకు తీసుకెళ్తుంది' అని ఒక ఫోటోకు కామెంట్ పెట్టాడు.
మరొక ఫోటోకు 'మిమ్మల్ని మీరు ప్రకాశవంతం చేసుకోండి' అని కామెంట్ పెట్టాడు. ఈ ఫొటోలకు ఇప్పటికే 35 వేల లైక్స్ రాగా 1,635 రీట్వీట్‌లు చేశారు. ఈ కొత్త లుక్‌పై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొత్త స్టైల్ కొంతమంది బాగుందంటూ రీట్వీట్లు చేస్తే.. మరికొందరు మేల్ వెర్షన్ ఆఫ్ లేడీ గాగాలా ఉన్నాంటూ సెటైర్లు విసిరారు.
ఓ మహిళా అభిమాని క్రేజీ లుక్‌తో చంపేశావ్ అంటూ పాండ్యా స్టైల్‌ను కొనియాడింది. 'వావ్.. మ్యాన్.. చంపేశావుగా' అని ఓ నెటిజన్ స్పందించగా 'హే.. అందగాడా..', 'లవ్ యూ..' 'రాక్‌స్టార్‌లా ఉన్నావ్...' అంటూ మరికొందరు మహిళా అభిమానులు కామెంట్లు పెట్టారు. కాగా, శ్రీలంకతో జరిగే తొలి రెండు టెస్టుల నుంచి పాండ్యాకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.