Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అవుట్... రనౌట్: పాండ్యా నో బాల్ విషయంలో గందరగోళం, అంఫైర్లతో స్మిత్ గొడవ

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో వన్డేలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (20) ఆఖరి ఓవర్‌లో అవుటైన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు ఓసారి పాండ్యా నాటకీయ పరిణామాల మధ్య అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

నిజానికి ఈ మ్యాచ్‌లో పాండ్యా ఎదుర్కొన్న ఓ నోబాల్‌ గందరగోళం సృష్టించింది. హార్దిక్ పాండ్యా అవుట్ నిర్ణయంపై అంపైర్లతో మైదానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ గొడవకి దిగాడు. దీంతో ప్రేక్షకులు అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు.

అసలేం జరిగిందంటే!

అసలేం జరిగిందంటే!

ఇన్నింగ్స్ 48వ ఓవర్ వేసిన రిచర్డ్‌సన్ నాలుగో బంతిని ఫుల్ టాస్‌గా విసరగా.. స్టాండ్స్‌లోకి తరలించాలని హార్దిక్ పాండ్యా హిట్ చేశాడు. అయితే షాట్ అతను ఊహించినట్లు బ్యాట్‌కి మిడిల్ కాకపోవడంతో బంతి కవర్స్‌లో గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ క్యాచ్ పట్టాడు. అదే సమయంలో వర్షం కూడా మొదలవడంతో తాను అవుటనుకుని పెవిలియన్‌కి అంపైర్‌ సిగ్నల్‌ను చూడకుండా పాండ్యా పెవిలియన్‌ వైపు నడిచాడు. అయితే పాండ్యా బౌండరీ లైన్ దాటకముందే.. ఆ బంతిని నోబాల్‌గా అంపైర్లు ప్రకటించారు.

అంపైర్లతో వాగ్వాదానికి దిగిన స్మిత్

అంపైర్లతో వాగ్వాదానికి దిగిన స్మిత్

దీంతో, స్మిత్‌ వెంటనే రనౌట్‌ చేయాలని బంతిని బౌలర్‌ వైపు విసరడంతో అతను వికెట్లను పడగొట్టాడు. అనంతరం అంపైర్లు నోబాల్ అని ప్రకటించగానే.. పాండ్యాని రనౌట్‌ ఇవ్వండి అని అంపైర్లని స్మిత్ కోరాడు. కానీ.. అంపైర్లు స్మిత్ అభ్యర్థనని తిరస్కరించారు. బ్యాట్స్‌మెన్ తాను అవుటనే ఉద్దేశంతో క్రీజులోకి రాకుండా వెళ్లిపోయాడు తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని స్మిత్‌కి నచ్చచెప్పినా.. అతను చాలా సేపు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కాసేపు చర్చించుకున్న ఫీల్డ్‌ అంపైర్లు బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించారు.

ఫ్రీ హిట్‌ ఇచ్చిన అంఫైర్లు

ఫ్రీ హిట్‌ ఇచ్చిన అంఫైర్లు

కాసేపటికి వర్షం ఆగడంతో భువీతో కలిసి పాండ్యా మళ్లీ బ్యాటింగ్‌కు రాగా.. అంపైర్లు ఫ్రీ హిట్‌ ఇచ్చారు. నిబంధనల ప్రకారం.. ఓ బ్యాట్స్‌మన్‌ తాను ఔటని (అంపైర్‌ ఇవ్వకున్నా) తప్పుగా భావించి వెళ్లిపోతున్నట్లయితే, అలాగని తాను సంతృప్తి చెందితే అంపైర్‌ జోక్యం చేసుకోవచ్చు. ఫీల్డింగ్‌ జట్టు తదుపరి చర్యకు దిగకుండా అడ్డుకునేందుకు బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించి, బ్యాట్స్‌మన్‌ను మళ్లీ పిలవొచ్చన్న ఎమ్‌సీసీ నిబంధన ప్రకారం అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకి వర్షం తర్వాత మళ్లీ హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌ని కొనసాగించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.

50 పరుగుల తేడాతో భారత్ విజయం

50 పరుగుల తేడాతో భారత్ విజయం

అనంతరం 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌటైంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో రెండో వన్డేలో భారత్ 50 పరుగులతో ఘన విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+