Hardik Pandya Viral Video: కాన్ఫిడెన్స్‌కు నిలువెత్తు రూపంలా హార్దిక్ పాండ్యా.. ఆ సైగతో విజయం కన్ఫామ్

ఆసియాకప్ మెగా టోర్నమెంట్‌లో భాగంగా దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్వితీయ విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్ అసలైన క్రికెట్ పసందును క్రికెట్ అభిమానులకు అందించింది. ఈ మ్యాచ్‌లో తొలుత పాకిస్తాన్.. 19.5 ఓవర్లల్లో 147పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (43పరుగులు) ఒక్కడే చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు విజయం అంత సులువుగా ఏం రాలేదు. చివరి ఓవర్ వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాట ఆడింది. బంతి బంతికి మసమీకరణాలు మారాయి. ఓవర్ ఓవర్‌కు మ్యాచ్‌లో మలుపులు.. వికెట్ వికెట్‌కు విస్మయం రేకెత్తే ఉత్కంఠ.. వెరసి ఈ హై ఓల్టేజీ మ్యాచ్‌లో భారత్ గెలిచిందంటే అందుకు ఒకే ఒక్క మెయిన్ రీజన్ ది వన్ అండ్ ఓన్లీ వన్ హార్దిక్ పాండ్యా. చివరి ఓవర్లో తన కంటి సైగతో విజయాన్ని నేను పూర్తి చేస్తాను అంటూ హార్దిక్ తలూపడం యావత్ భారత క్రికెటర్ల గుండెను తాకింది. సైగ చేసినట్లుగానే సిక్స్‌తో కూల్‌గా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
చివరి ఓవర్లో ఏం జరిగిందంటే..
19వ ఓవర్లో హార్దిక్ మూడు ఫోర్లు బాదడంతో సమీకరణం 20వ ఓవర్‌కు 6బంతుల్లో 7పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక క్రీజులో కుదురుకున్న రవీంద్రా జడేజా ఉన్నాడు. బంతిని స్పిన్నర్ నవాజ్ అందుకున్నాడు. నవాజ్ బౌలింగ్లో అంతకుముందు సిక్సు, ఫోర్లు బాదిన జడేజా.. ఈజీగా బౌండరీ బాదేస్తాడని అంతా అనుకున్నారు. ఇక అనుకున్నట్లే తొలి బంతికి హిట్ చేయాలని చూసిన జడేజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో స్టేడియంలో భారత అభిమానులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ రెండో బంతికి వచ్చీ రాగానే సింగిల్ తీసిచ్చాడు. మూడో బంతికి క్రీజులోకి హార్దిక్ వచ్చాడు. అయితే ఆ బంతికి పరుగులేమీ రాలేదు. అయినా హార్దిక్ మొఖంలో కించిత్ టెన్షన్ కన్పించలేదు. అవతలి ఎండ్‌లో ఉన్న దినేష్ కార్తీక్ వైపు చూస్తూ.. ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్ అనేలా తలను ఊపి కంటితో సైగ చేశాడు. అనుకున్నట్లుగానే నాలుగో బంతికి లాంగాన్లో సిక్స్ బాదాడు. అంతే స్టేడియం హోరెత్తింది. హార్దిక్ మాత్రం కూల్‌గా చిరుదరహాసంతో విజయాన్ని ఆస్వాదించాడు. హార్దిక్‌కు టేక్ ఏ బో ఇచ్చాడు.
ఎంత ప్రెషర్ ఉంటే అంత స్పెషల్.. !
ఎంత ప్రెషర్ ఉంటే అంత స్పెషల్ తాను అని చూపించేలా హార్దిక్ అసామాన్య ప్రదర్శనకు అవతలి ఎండ్‌లో ఉన్న దినేష్ కార్తీక్ సహా.. ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ గులాం అయ్యారు. గెలవడం వేరు.. గెలిపించడం వేరు.. కానీ హార్దిక్ ఈ రెండింటికీ పూర్తి భిన్నం.. అదే గెలిచేశాం. కాన్ఫిడెన్స్ విషయంలో హార్దిక్ తోపులకే తోపు.. అతను ముందుగానే విజయాన్ని చూసేశాడు. అందుకు తగ్గ ప్లాన్‌ను సమర్థంగా అమలు చేశాడు. బౌలర్ ఎవరనేది సంబంధం లేదు.. ఫీల్డింగ్ సెట్ విషయాన్ని చూసి కంగారు పడాడు.. ప్రత్యర్థి కెప్టెన్ వ్యూహాలను ఊహించుకుని తడబడడు.. ఒకట్రెండు పరుగుల కోసం విలువైన వికెట్ పోగోట్టుకోడు.. ఏం చేయాలనేది తనకు స్పష్టంగా తెలుసు.. దానికి తగ్గ కాన్ఫిడెన్స్‌ను ఎద నిండా నింపుకుంటాడు.. ఎదురుగా ఎంతటి తోపు ప్రత్యర్థి ఉన్నా తాను అనుకున్నది సాధిస్తాడు. అలా కాన్ఫిడెన్స్‌కు నిలువెత్తు రూపంలా నిలిచి మ్యాచ్‌ల్లో విజయ ఢంకా మోగిస్తాడు.. అందుకే అతని హయాంలో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది.. ఇప్పుడు అతని ఆటతో పాక్‌పై ఇండియా గెలుపొందింది. రేప్పొద్దున భారత్ ప్రపంచకప్ గెలవడానికి కూడా హార్దిక్ పాండ్యా తన 100పర్సెంట్ ఇస్తాడు.
మిడిలార్డర్ భరతం పట్టిన పాండ్యా
ఇకపోతే ఈ మ్యాచ్ విషయానికొస్తే హార్దిక్ పాండ్యా (33పరుగులు 17బంతుల్లో 4ఫోర్లు 1సిక్సర్) అద్వితీయ ఫినిషింగ్ నాక్ ఆడడంతో 5వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అంతకుముందు బౌలింగ్లోనూ హార్దిక్ సత్తాచాటాడు. పాక్ మిడిలార్డర్ భరతం పట్టాడు. 4ఓవర్ల కోటా వేసిన హార్దిక్ 25పరుగులిచ్చి 3కీలక వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దీల్‌లను అతను ఔట్ చేశాడు. ఇక చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా గెలుపు ముంగిట చేసిన విజయ సైగ ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications