ధోనీకి హెయిర్ కట్ చేసిన పాండ్యా, కోపగించుకున్న అనుష్క

హైదరాబాద్: టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ శనివారం తన 37వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా టీమ్‌మేట్స్‌తోపాటు అభిమానులంతా అతనికి బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ప్రత్యేకమైన రోజునాడు ధోనీకి నా ప్రత్యేకమైన హెయిర్ కట్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు పాండ్యా ట్విటర్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇది ఎక్స్‌పర్ట్స్ చేసే పని.. ఇంట్లో ఎవరూ ప్రయత్నించకూడదు అంటూ కింద ఓ ఫన్నీ కామెంట్ కూడా పెట్టాడు.

కుల్‌దీప్ యాదవ్‌కు కేక్ రుద్దుతున్న వీడియో
ఇక బర్త్‌డే కేక్ కట్ చేసిన సందర్భంగా తాను స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు కేక్ రుద్దుతున్న వీడియోను ధోనీ షేర్ చేశాడు. టీమ్ ఎవరి బర్త్ డే జరిగినా వాళ్లను కేక్‌తో ముంచెత్తడం ధోనీకి అలవాటు. ఇప్పుడు తన బర్త్‌డే రోజు కుల్‌దీప్ కూడా ఇలాగే ధోనీని కేక్‌లో ముంచెత్తగా.. అతడు మళ్లీ రివేంజ్ తీర్చుకున్నాడు.

500 అంతర్జాతీయ మ్యాచ్‌లాడి
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌తో ధోనీ మరో రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 500 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మూడో ఇండియన్ ప్లేయర్‌గా ధోనీ నిలిచాడు. అతని కంటే ముందు సచిన్ 664, ద్రవిడ్ 509 మ్యాచ్‌లతో ఉన్నారు.

అనుష్క కోపంగా కనిపించి:
మరోపక్క ధోనీ పుట్టిన రోజు వేడుకల్లో తీసిన ఫొటోల్లో అనుష్క కోపం బయటపడింది. ఈ కార్యక్రమంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ, అతని సతీమణి, నటి అనుష్క శర్మ కూడా హాజరయ్యారు. టీమ్ సభ్యులు ధోనీకి కేక్ తినిపిస్తున్న సమయంలో అనుష్క కోపంగా కనిపించింది. మాజీ క్రికెటర్ అరుణ్ పాండే షేర్ ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు.

అనుష్కశర్మ కోహ్లీ వైపు సీరియస్‌గా
ఇందులో అనుష్కశర్మ కోహ్లీ వైపు సీరియస్‌గా చూస్తున్నట్లు ఉంది. దీంతో ఆ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు.. అనుష్క అంత కోపం ఎందుకని కొందరు, అనుష్క ఎక్స్‌ప్రెషన్ చూడండి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications