టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరగబోయే హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మల మధ్య జరిగిన ఓ క్యూట్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య కీలక పోరు జరగనున్న సంగతి తెలిసింది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే కొలంబో చేరుకుంది. అయితే కొలంబో ఎయిర్పోర్టులో హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో ప్రయాణం చేసి అలసిపోయిన మహికా శర్మ.. హార్దిక్ భుజంపై తల వాల్చి విశ్రాంతి తీసుకుంటుండగా.. హార్దిక్ ఆమె నుదుటిపై ముద్దుపెట్టుకుని ఓదార్చాడు. ఈ రొమాంటిక్ వీడియో చూసిన నెటిజన్లు "హార్దిక్ ఈజ్ ఏ జెంటిల్‌మెన్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాత్‌రోబ్‌లో హోటల్ లాబీలోకి.. అందరినీ ఆశ్చర్యపరిచిన హార్దిక్!
మరో వీడియోలో హార్దిక్ పాండ్యా తనదైన 'బిందాస్' శైలిలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొలంబోలోని టీమిండియా బస చేసిన హోటల్ లాబీలో హార్దిక్ బాత్‌రోబ్ ధరించి, మహికా శర్మ చేతిని పట్టుకుని నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు హార్దిక్ స్టైల్‌కు కొందరు ఫిదా అవుతుంటే.. మరికొందరు హోటల్ లాబీలో బాత్‌రోబ్ ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన?
టీ20 వరల్డ్ కప్ వంటి ప్రధాన టోర్నీల సమయంలో ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులు లేదా భాగస్వాములు ఉండకూడదనే కఠినమైన నిబంధనను బీసీసీఐ అమలు చేస్తోంది. అయితే, హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి హోటల్‌లో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిబంధనలను అతిక్రమించకుండానే హార్దిక్ ఆమెతో సమయాన్ని గడుపుతున్నారా? లేక బోర్డు నుండి ప్రత్యేక అనుమతి తీసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేవలం హోటల్ వీడియో మాత్రమే కాకుండా, ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా హార్దిక్ తన ప్రేయసికి ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తన మెడ వెనుక భాగంలో రెండు చిరుతపులులు, మహికా పేరులోని మొదటి అక్షరం 'M' వచ్చేలా ఒక కొత్త టాటూను వేయించుకున్నారు. ఈ టాటూ వారి బంధానికి గుర్తుగా వేయించుకున్నట్లు సమాచారం.
రెచ్చిపోయి ఆడుతున్న హార్దిక్ పాండ్యా
ప్రస్తుత వరల్డ్ కప్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా నమీబియాపై జరిగిన మ్యాచ్‌లో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాకు విజయాన్ని అందించాడు: కేవలం 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను హార్దిక్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కూడా గెలుచుకున్నాడు.
పాకిస్థాన్‌తో పోరులో కీలకం
టీమిండియా ఈ టోర్నీలో వరుసగా అమెరికా, నమీబియా జట్లపై గెలిచి మంచి ఊపు మీద ఉంది. రేపు పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా పాత్ర అత్యంత కీలకం కానుంది. గతంలోనూ పాకిస్థాన్‌పై హార్దిక్ బ్యాట్‌తోనూ, బంతితోనూ మెరిసిన రికార్డు ఉంది. అదే మ్యాజిక్ కొలంబోలో కూడా రిపీట్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.