Hardik pandya: గుజరాత్ టైటాన్స్ సక్సెస్ సీక్రెట్స్ తెలిపిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిది మ్యాచ్‌లు గెలిచింది. దీంతో గుజరాత్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం దాదాపు ఖాయమైంది. గుజరాత్ టీం ప్రదర్శన పట్ల చాలా మంది క్రికెట్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జట్టు విజయాల పరంపర గురించి హార్దిక్ మాట్లాడుతూ.. జట్టులో ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే హెచ్చుతగ్గులు ఏవీ లేవని చెప్పాడు. ఈ ఐపీఎల్లో అరంగేట్రం చేసి గుజరాత్ టైటాన్స్ జట్టు నిలదొక్కుకోవడానికి, రాణించడానికి, జట్టులో కొంత మంచి సఖ్యత నెలకొనడానికి చాలా టైమ్ పడుతుందని అందరూ భావించారు. కానీ గుజరాత్ టీం అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ ఎంతో అన్యోన్యంగా కన్పిస్తుంది. గ్రౌండ్లో వారి ప్రదర్శన బట్టి ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్‌స్టన్ లాంటి దిగ్గజాల కోచింగ్ ఆధ్వర్యంలో జట్టు సహాయక సిబ్బంది కూడా చక్కగా పనిచేస్తున్నారు.

వ్యక్తిగా కంటే జట్టుగా ఎదగడమే ఇష్టం: హార్దిక్ పాండ్యా
'నేను ఒక వ్యక్తిగా ఎదగడానికి ఇష్టపడను. జట్టుగా ఎదగడానికే ఇష్టపడతాను. నేను నా సహచరులతో లేదా నా చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎదగడానికి ఇష్టపడతాను. అదే మా విజయానికి కారణం. నేను కెప్టెన్‌ని కావచ్చు.. కానీ అంతమాత్రాన నేను గొప్ప మిగతావారు తక్కువ అన్న ఫీలింగ్స్ ఏం లేవు అని' అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం హార్దిక్ తెలిపాడు.

వన్ ఫర్ ఆల్.. ఆల్ ఫర్ వన్
"మా జట్టులో అందరూ ఒకే మార్గంలో ఉన్నాం. అదే వన్ ఫర్ ఆల్.. ఆల్ ఫర్ వన్. ఇది మేము అనుసరిస్తున్న విధానం. జట్టులోని ప్రతి ప్లేయర్ కెప్టెన్‌లాగే తాము జట్టుకు కీలకమైన వారిమని భావిస్తున్నారు. వాళ్లు సహజంగానే కొత్త అవకాశాలను ఆస్వాదిస్తున్నారు. చుట్టూ మంచి మోటివేషన్ ఇచ్చే వ్యక్తులున్నారు. ఇప్పటికే మంచి ఫలితాలు వస్తుండడంతో ఇంకా మా ప్లేయర్ల నుంచి ఎక్కువ ఏం ఎక్స్ పెక్ట్ చేయట్లే. "అని హార్దిక్ పేర్కొన్నాడు.

లొసుగులను అధిగమించి.. సరికొత్త మార్గాన్ని అన్వేషించి
ఈ సీజన్‌లో పేపర్ మీద పేర్ల ప్రకారం గనుక చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ అంత బలమైన జట్టు కాదని గమనించాలి. ఆ జట్టు విషయంలో చాలా లొసుగులు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అన్ని లొసుగులను అధిగమించి గుజరాత్ టైటాన్స్ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. సమిష్టి ప్రదర్శనతో ఎనిమిది విజయాలతో 16పాయింట్లు సాధించింది. టైటాన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరుకున్నట్లే. మరో విజయం సాధిస్తే.. అధికారికంగా ప్లేఆఫ్ చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications