
ధోని కెప్టెన్సీలో అరంగేట్రం
మహేంద్రసింగ్ ధోని నాయకత్వంలో 2016లో హార్ధిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా క్రికెట్‌లోకి అరంగేంట్రం చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో వేసిన తొలి ఓవర్లోనే 5 వైడ్‌లు వేయడమే కాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ధోని మళ్లీ అతనికి బౌలింగ్ వేసే అవకాశం ఇవ్వడంతో 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత హార్ధిక్ పాండ్యాను ధోని అన్ని రకాలుగా ప్రోత్సహించాడు.

ధోని నుంచి అది నేర్చుకున్నా..
''టీమిండియాలోని ప్రతి ఆటగాడి నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాను. ఇక కెప్టెన్ ధోని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ధోని ఏం పట్టించుకోనట్టే ఉంటాడు కానీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తాడు. ఆటగాళ్ల ఎదుగుదలకు పూర్తిగా సహకరిస్తాడు. ఆటగాళ్ల లోపాలను, బలహీనతలను వారే స్యయంగా అధిగమించాలని కోరుకుంటాడు. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకుని నిత్యం మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించాను. అందుకే ఇన్నాళ్లు జట్టులో ఉండగలిగాను.'' అని పాండ్యా చెప్పాడు. ఇలా ధోనిపై పాండ్యా ప్రశంసలు కురిపించాడు.

ధోని లేకపోతే ఆ రోజే ముగిసేది
''నా అరంగేట్ర ఓవర్‌లోనే 22 పరుగులు ఇచ్చాను. అంతేకాకుండా ఆ ఓవర్‌లో 5 వైడ్లు వేసి మొత్తంగా 11 బంతులు వేశాను. ఇక తన కెరీర్ ముగిసిందని, అరంగేట్ర మ్యాచే చివరి మ్యాచ్ అవుతుందని భయపడ్డాను. కానీ ధోని మళ్లీ తన దగ్గరకు వచ్చి బౌలింగ్ చేయమని బంతి ఇవ్వడంతో ఆశ్చర్యపోయాను. ధోని ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ మ్యాచ్‌లో 3 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చినప్పటికీ 2 వికెట్లు తీశాను. ఇక అప్పటి నుంచి నా ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఆ ఘటనతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ధోని లేకపోతే ఈ రోజు నా కెరీర్ ఉండేది కాదు. ధోని ప్రోత్సహించకుంటే ఆ రోజే నా అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయేది'' అని పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. కాగా ఆ మ్యాచ్‌లో పాండ్యా.. ఆస్ట్రేలియా బ్యాటర్లు లిన్, వేడ్ వికెట్లను తీశాడు.

విండీస్‌తో సిరీస్‌కు రెడీ
అనంతరం భారత్ జట్టులో హార్దిక్ పాండ్యా సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడు. బ్యాట్, బంతితో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా స్థిరపడిపోయాడు. అయితే గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు హార్ధిక్ పాండ్యా దూరమయ్యాడు. ప్రస్తుతం పాండ్యా గాయం నుంచి కోలుకున్నట్టు తెలుస్తోంది. దీంతో విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు పాండ్యా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












