For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ హవా..! రెండు స్థానాలు ఎగబాకి..

Hardik Pandya Reached Career Best Rank in T20I Allrounders Rankings

గాయం నుంచి కోలుకున్నాక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌-2022లో పునరాగమనం చేసినప్పటి నుండి భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మంచి ఫామ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా నిన్న ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 30బంతుల్లో 71పరుగులు నాటౌట్‌తో అదిరిపోయే నాక్ ఆడాడు. ఇక ఈ ఇన్నింగ్స్ అనంతరం పాండ్యా టీ20 ఆల్‌రౌండర్ జాబితాలో టాప్ 5 ర్యాంకుకు చేరుకున్నాడు. హార్దిక్ 7వ స్థానం నుంచి రెండు స్థానాలు ఎగబాకి ఈ ర్యాంకును అందుకున్నాడు. భారత్ తరఫున టాప్ 10లో ఉన్న ఏకైక ఆల్రౌండర్ హార్దికే. మంగళవారం మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో హార్దిక్ చివర్లో రెచ్చిపోయాడు. భారత్ 20ఓవర్లలో 208పరుగుల భారీ స్కోరు చేసిందంటే అందుకు హార్దిక్ ఇన్నింగ్సే కారణం.

పాండ్యా తన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 7బౌండరీలు కొట్టాడు. పాండ్యా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. అతను ఆ సిరీస్లో కీలక ప్రదర్శన కనబర్చి సిరీస్‌ 2-2తో సమమయ్యే విషయంలో కీ రోల్ పోషించాడు. ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా వెళ్లాడు. అక్కడ యువ జట్టును నడిపించిన హార్దిక్ ఆ సిరీస్‌ను 2-0 తేడాతో వైట్ వాష్ చేసేలా భారత్‌ను నడిపించాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్లోను అలాగే పాకిస్తాన్‌పై జరిగిన ఆసియా కప్ ఓపెనర్‌ మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. హార్దిక్ ప్రస్తుతం కెరీర్ పీక్ ఫామ్‌లో ఉన్నాడు. హార్దిక్ జట్టుకు మంచి సమతూకం తెచ్చే ప్లేయర్‌గా మారుతున్నాడు.

టీ20 ప్రపంచ‌కప్‌కు ముందు భారత జట్టులో చాలా ముఖ్యమైన ప్లేయర్‌గా హార్దిక్ మారాడు. ఆట పట్ల కొత్త వైఖరితో, పాజిటివ్ ఇంటెంట్‌తో హార్దిక్ కన్పిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే మిగతా రెండు మ్యాచ్‌లలోను హార్దిక్ బాగా రాణిస్తే.. అతని ర్యాంకు మరింత మెరుగుపడే వీలుంది. టీ20 ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్‌లో షకీబ్ అల్ హసన్ తొలిస్థానంలో ఉండగా.. మహమ్మద్ నబీ, మొయిన్ అలీ, వనిందు హసరంగా వరుసగా 2,3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక స్థానం పడిపోయి ఆరోస్థానానికి దిగజారాడు.

Story first published: Wednesday, September 21, 2022, 16:14 [IST]
Other articles published on Sep 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+