Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అర్ధరాత్రి 1:30 కు హార్దిక్ ప్రాక్టీస్: ఆడి కష్టం చూస్తోంటే ఏడుపు ఆగట్లేదు మచ్చా

ఈ ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ ఏ మాత్రం కలిసిరాలేదు. వరుస మ్యాచ్ లల్లో ఓటమి పాలైన ఈ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్.. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి అవుట్ అయింది. దానికి తోడు కేప్టెన్ హార్దిక్ పాండ్యా వివాదాల్లో చిక్కుకున్నాడు. నడుం నొప్పి, జట్టు యాజమాన్యంతో విభేదాలు, కెప్టెన్సీ విషయంలో విమర్శలు.. ఇలా ముప్పేట దాడిని ఎదుర్కొంటోన్నాడు.

నడుం నొప్పితో ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లకు దూరం అవొచ్చనే వార్తలకు తాజాగా చెక్ పెట్టాడు హార్దిక్ పాండ్యా. తన తాజా వీడియోతో వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు. ధర్మశాల వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు.. తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోన్నాడు. ముంబైలో అర్ధరాత్రి 1:30 గంటలకు నెట్ సెషన్స్ లో కనిపించాడు హార్దిక్. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తనదైన శైలిలో భారీ షాట్లు ఆడాడు.

ముంబై ఇండియన్స్ ఆడిన చివరి రెండు మ్యాచ్‌లకు హార్దిక్ పాండ్యా నడుము నొప్పి కారణంగా దూరమయ్యాడు. అతని గైర్హాజర్ కావడం పుకార్లకు తెరతీసింది. జట్టులో విభేదాలు తలెత్తాయని, అతని పేలవమైన కెప్టెన్సీ పట్ల మేనేజ్మెంట్ కూడా ఆగ్రహంతో ఉందనే ఊహాగానాలు చెలరేగాయి. తాజా వీడియోతో ఈ విమర్శలకు తెరదించాడు.

Hardik Pandya Practice at 1 30 AM signals readiness before showdown with Punjab Kings on May 14

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల సమయంలో ముంబైలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో హార్దిక్ తీవ్రంగా సాధన చేస్తూ కనిపించారు. ఈ గ్రౌండ్ రిలయన్స్ కార్పొరేట్ పార్క్ కు చెందినది కావడం వల్ల జట్టు యాజమాన్యంతో కూడా విభేదాలు లేవనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. ఈ వీడియోలో అతను కఠోరమైన శిక్షణలో పాల్గొనడం, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తన నైపుణ్యాలను సానబెట్టుకోవడం చూడొచ్చు.

అన్ని పుకార్లకు అడ్డుకట్ట వేశాడు అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ అయింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ నిరాశజనకంగా ఆడుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది. 11 మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరడం గత మూడేళ్లలో ఇది రెండోసారి. హార్దిక్ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గురువారం జరిగే మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటుపై అనుమానాలు నెలకొనడంతో, సూర్యకుమార్ యాదవ్ మరోసారి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

Story first published: Wednesday, May 13, 2026, 14:47 [IST]
Other articles published on May 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+