Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లవ్ యూ.. హ్యాపీ బర్త్ డే..: హార్ధిక్ పాండ్యా

Hardik Pandya pours his heart out with Krunal Pandyas birthday wish

హైదరాబాద్: పాండ్యా నుంచి పాండ్యాకు 'హ్యాపీ బర్త్ డే' అంటూ ప్రత్యేక శుభాకాంక్షలు వచ్చాయి. కృనాల్ పాండ్యాకు హార్థిక్ పాండ్యా ప్రేమ పూర్వకమైన శుభాకాంక్షలను పంపాడు.
ముంబై ఇండియన్స్‌ ఆటగాడైన హార్దిక్‌ పాండ్య తన సోదరుడు కృనాల్‌ పాండ్య జన్మదినం పురస్కరించుకుని ప్రత్యేక రీతిలో శుభాకాంక్షలను తెలిపాడు. ఏప్రిల్ 7న మొదలు కానున్న ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతుండటంతో ఇప్పటికే హార్ధిక్ పాండ్యా ఇంటికి దూరంగా ఉన్నాడు.

ఈ సందర్భంగా ఐపీఎల్ నిమిత్తం ప్రాక్టీసులో ఉన్న హార్ధిక్ తన సోదరుని కోసం ప్రత్యేకంగా శుభాకాంక్షలు పంపాడు. దీంతో పాటు సరదాగా ఓ గిఫ్ట్ కూడా పంపాడు. ఆ వీడియోలో తన సోదరుడిని ఉద్దేశించి..వారి మధ్య ఉన్న అనుబంధం గురించి వివరించాడు.

'బ్రదర్‌ హ్యాపీ బర్త్ డే టూ యూ. గత ఏడాది ఐపీఎల్‌లో ఎప్పుడూ నా వెనకే ఉండి నన్ను ఎంతో ప్రోత్సహించావు. కంటికి రెప్పలా ప్రతి నిమిషం నన్ను గమనిస్తూనే ఉన్నావు. ముంబై ఇండియన్స్‌ అప్‌లోడ్‌ చేసిన ఓ వీడియోలో ఇదంతా చూశాను. ఆ వీడియో చూసి నేనెంతో ఎమోషనల్‌ అయ్యాను. ఈ ఏడాది నేను నీ వెనుక ఉంటాను. నిన్ను ప్రతిక్షణం చూసుకుంటాను.' అని సోదరునిపై తన అభిమానాన్ని చాటాడు.

ఇంకా అదే ట్వీట్‌లో.. 'మేమంతా నిన్ను ఎంత ప్రేమిస్తామో నీకు తెలుసు. అమ్మ, నాన్న, పంకూ(కృనాల్‌ భార్య) ఇలా అందరూ నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్నాను. నువ్వు నీ జీవితంలో విజయవంతం కావాలి. ఎల్లప్పుడూ నా పక్కనే ఉండాలి. పుట్టిన రోజు జరుపుకొంటున్న నీకు నా తరఫు నుంచి ఒక కానుక' అంటూ హార్దిక్‌ రెండు బౌల్స్‌లో మ్యాగీని చూపించాడు. ఇదంతా ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది.

Story first published: Sunday, March 25, 2018, 13:43 [IST]
Other articles published on Mar 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+