హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా చివరి ఓవర్‌లో మొదటి మూడు బంతులను మూడు సిక్సర్లుగా మలచిన సంగతి తెలిసిందే. ఇమాద్ వేసిన బౌలింగ్‌లో వరుసగా మొదటి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | స్కోరు కార్డు
యువరాజ్ సింగ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా 6 బంతుల్లోనే 20 పరుగులు సాధించడం విశేషం. అంతేకాదు చివర్లో పాండ్యా, కోహ్లీ మెరుపులు మెరిపించడంతో టీమిండియా 319 పరుగులు చేసింది. అయితే చివరి ఓవర్ వేసిన బౌలర్ ఇమాద్ మైండ్‌ను ముందే పసికట్టిన పాండ్యా వాటిని ఎలా బాదాడో ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

అందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బౌలర్ మైండ్‌ను రీడ్ చేయాలంటూ తనకు సంకేతాలిచ్చినట్లు పాండ్యా చెప్పుకొచ్చాడు. ఆ చివరి ఓవర్‌ను స్పిన్నర్ వేస్తాడని తెలియడంతో కళ్లల్లో ఆనందం కలిగిందని, కానీ బౌండరీ పెద్దది కావడం వల్ల పవర్ హిట్టింగ్ చేయాల్సి వచ్చిందని పాండ్యా అన్నాడు.
గత వారం ఎడ్జిబాస్టన్ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 48 ఓవర్లలో 319 పరుగులు చేసింది. అనంతరం 320 పరుగల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 33.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది.