యోయో టెస్టు కాదు.. వర్క్‌లోడ్ టెస్టులోనే హార్దిక్ పాండ్యా విఫలం!!

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 16 మంది ఆటగాళ్లను కివీస్ పర్యటన కోసం ఎంపిక చేసింది. ఒక మార్పు మినహా ఇటీవల ఆస్ట్రేలియాపై ఆడిన జట్టునే కొనసాగించారు. ముంబై ఆటగాడు పృథ్వీ షా వన్డేల్లో తొలిసారి చోటుదక్కించుకోగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరోసారి నిరాశే ఎదురైంది.

వర్క్‌లోడ్ టెస్టులో విఫలం:
హార్దిక్ పాండ్యా సరైన ఫిట్‌నెస్ సాధించకపోవడంతోనే కివీస్ వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారని ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. హార్దిక్ యోయో టెస్టు, బౌలింగ్ ఫిట్‌నెస్ కంటే ముందే వర్క్‌లోడ్ టెస్టులో విఫలం అయ్యాడని పేర్కొంది. 'హార్దిక్ వర్క్‌లోడ్ టెస్టులోనే విఫలమయ్యాడు. అంటే.. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని అర్థం' అని బీసీసీఐ అధికారి తెలిపారు.

నెల క్రితమే ప్రాక్టీస్ మొదలు:
గత కొంతకాలంగా వెన్ను గాయంతో సతమవుతున్న హార్దిక్ పాండ్యా విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో దాదాపు నాలుగు నెలలు జట్టుకు దూరమైయ్యాడు. గాయం నుండి కోలుకుంటూ.. నెల క్రితమే తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. జనవరి 14న ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేకు ముందు కోహ్లీసేనకు నెట్స్‌లో హార్దిక్ బంతులు విసిరాడు. ఆ సమయంలో భారత జట్టు కోచింగ్ బృందం పరీక్షించగా.. అతడు బౌలింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌కు వెళ్లిన భారత్-ఎ జట్టుకు అతడిని ఎంపిక చేయలేదు.

దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే:
మరోవైపు రెండుమూడు రోజుల్లో పూర్తిఫిటెనెస్ సాధిస్తే.. కివీస్ పర్యటనకు హార్దిక్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావించింది. అందుకే టీమిండియా వన్డే, టెస్ట్ జట్ల ఎంపికను ఆలస్యం చేసింది. కానీ హార్దిక్ 'వర్క్‌లోడ్ టెస్టు'లో విఫలమవ్వడంతో సెలక్టర్లు అతన్ని పక్కనపెట్టారని సమాచారం తెలుస్తోంది. ఇక హార్దిక్ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. జనవరి 24 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది. అప్పటికి హార్దిక్‌కోలుకోనున్నాడు.

ఎన్‌సీఏకు హార్దిక్:
'వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్.. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లనున్నాడు. ఎన్‌సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్, అతడి బృందం పర్యవేక్షణలో హార్దిక్ శిక్షణ పొందనున్నాడు. దాదాపు రెండు వారాల పాటు అతడు ఎన్‌సీఏలోనే ఉండి శిక్షణ పొందుతాడు. ఆ తర్వాతే అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేస్తాడు' అని బీసీసీఐకి చెందిన వర్గాలు రెండు రోజుల క్రితం తెలిపాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications