For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పూటకో వేషం.. మ్యాచ్‌కో రంగు!: స్టైల్ కొంచెం తగ్గించు బాసూ!!

టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లోనే ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంతో భారత జట్టు తన తొలి మ్యాచ్ అమెరికా జట్టుతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడబోతోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆట కంటే ముందు తన అద్భుతమైన స్టైలిష్ లుక్‌తో వార్తల్లో నిలిచాడు.

వైట్ బ్లాండ్ హెయిర్ స్టైల్‌తో పాండ్యా కొత్త లుక్
సాధారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. మైదానం బయట అంత స్టైలిష్‌గా కనిపిస్తాడు. తాజాగా పాండ్యా తన హెయిర్ స్టైల్‌ను పూర్తిగా మార్చేశాడు. జట్టుకు 'వైట్ బ్లాండ్' (సిల్వర్ లేదా యాషీ టోన్) కలర్ వేయించుకుని సరికొత్తగా కనిపిస్తున్నాడు. బ్లీచింగ్ పద్ధతిలో చేసిన ఈ మేకోవర్‌లో పాండ్యాను ఒక్కసారిగా గుర్తుపట్టడం అభిమానులకు కష్టమవుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి.

Hardik Pandya New White Blonde Look Sparks Memes Fans React Before T20 World Cup 2026 some praise the makeover

పాత లుక్ వర్సెస్ కొత్త లుక్
2024 టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా క్లీన్ షేవ్, పొడవైన మీసాలు, షార్ట్ హెయిర్ స్టైల్‌తో కనిపించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ లుక్ కూడా పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా, లైట్ గడ్డంతో పాటు సిల్వర్ హెయిర్‌తో సరికొత్త అవతారం ఎత్తాడు. నెటిజన్లు ఈ లుక్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు "హార్దిక్ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాడు" అని కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు "పూటకో వేషం మార్చడంలో ఇతను మొనగాడు" అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు.

సూర్యకుమార్ యాదవ్‌కు 'బ్రహ్మాస్త్రం'
లుక్ ఏదైనా, మైదానంలో హార్దిక్ ఇచ్చే ప్రదర్శన టీమిండియాకు అత్యంత కీలకం. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు హార్దిక్ ఓ నమ్మదగ్గ ఆయుధం. 2024 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 16 పరుగులు కాపాడి భారత్‌కు విశ్వవిజేతగా నిలబెట్టిన ఘనత పాండ్యాది. ఈసారి కూడా బౌలింగ్‌లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడానికి, బ్యాటింగ్‌లో ఆరో స్థానంలో వచ్చి విధ్వంసం సృష్టించడానికి హార్దిక్ పాండ్యా సిద్ధంగా ఉన్నాడు. వార్మప్ మ్యాచ్‌లలోనూ అదరగొట్టిన హార్దిక్.. తన కొత్త లుక్‌తో పాటు మెరుపు ప్రదర్శనతో అమెరికాపై ఎలా విరుచుకుపడతాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Friday, February 6, 2026, 13:42 [IST]
Other articles published on Feb 6, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+