For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RCB: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి భారతీయ ఆటగాడిగా!

Hardik Pandya: సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై జట్టు ఈ సీజన్ లో తొలి సారిగా తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ఆడింది. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై జట్టు 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో నాలుగో ఓటమిని చవిచూసింది. అయితే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. అలాంటి ఘనత సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు.

చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా
ఆర్సీబీపై హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ ఆ స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ లో 5 వేలకు పైగా పరుగులు సాధించడమే కాకుండా 200 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. హార్దిక్ కంటే ముందు ఏ భారత ఆటగాడు కూడా ఈ ఘనతను సాధించలేదు. అటువంటి ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసి, అత్యధిక వికెట్లు తీసిన రికార్డు రవి బొపారా పేరిట ఉంది. తన టీ20 కెరీర్‌లో 9,486 పరుగులు చేయడమే కాకుండా 291 వికెట్లు కూడా పడగొట్టాడు.

Hardik Pandya Makes History as the First Indian to Score 5 000 T20 Runs and Take 200 Wickets

ఆర్సీబీపై హార్దిక్ అద్భుతాలు
ఆర్సీబీపై హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హార్దిక్ 15 బంతుల్లో 42 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో హార్ధిక్ పాండ్యా 3 ఫోర్లతో పాటు 4 సిక్సర్లు కొట్టాడు. ఇది కాకుండా బౌలింగ్ కూడా హార్ధిక్ అద్భుతాలు చేశాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

టీ20 5వేల కంటే ఎక్కువ పరుగులు చేసి 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..

రవి బొపారా(ఇంగ్లాండ్) -9,486 పరుగులు -291 వికెట్లు
సమిత్ పటేల్(ఇంగ్లాండ్) - 6,643 పరుగులు -352 వికెట్లు
షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా) -8,821 పరుగులు -216 వికెట్లు
మహ్మద్ హఫీజ్(పాకిస్తాన్) -7,946 పరుగులు -202 వికెట్లు
డేనియల్ క్రిస్టియన్(ఆస్ట్రేలియా) -5,848 పరుగులు -281 వికెట్లు
డ్వేన్ బ్రావో(వెస్టిండీస్) - 6,970 పరుగులు- 631 వికెట్లు
కీరాన్ పొలార్డ్ (వెస్టిండీస్)- 13,537 పరుగులు- 326 వికెట్లు
షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్) - 7,438 పరుగులు- 492 వికెట్లు
మొయిన్ అలీ(ఇంగ్లాండ్)- 7,140 పరుగులు- 245 వికెట్లు
మొహమ్మద్ నబీ(ఆఫ్ఘనిస్తాన్)- 6,135 పరుగులు- 369 వికెట్లు
ఆండ్రీ రస్సెల్(వెస్టిండీస్)- 9,018 పరుగులు- 470 వికెట్లు
హార్దిక్ పాండ్యా(భారత్) - 5,432 పరుగులు- 200 వికెట్లు

Story first published: Tuesday, April 8, 2025, 12:05 [IST]
Other articles published on Apr 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+