For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్?

Hardik Pandya: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. అద్వితీయమైన ప్రదర్శనతో క్వాలిఫయర్-2కు దూసుకొచ్చిన ఆ జట్టుకు పంజాబ్‌ కింగ్స్ ఊహించని షాకిచ్చింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. శ్రేయస్ అయ్యర్(41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 నాటౌట్)విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఓటమి తర్వాత పాండ్యా ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు.

ఈ ఓటమితో ముంబై జట్టు మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. ముంబై జట్టు యాజమాన్యంతో పాటు సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నా, ఇప్పటివరకు అధికారికంగా అలాంటి ప్రకటన ఏమీ రాలేదు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి రాజీనామా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. కానీ ఇది ఒక వార్త మాత్రమే, అధికారిక ప్రకటన కాదు. ఈ వార్తలు వస్తున్న క్రమంలో తదుపరి ముంబై కెప్టెన్ ఎవరు అని నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ భవితవ్యంపై చర్చలు మొదలయ్యాయి.

Hardik Pandya Likely to Step Down as Mumbai Indians Captain After IPL 2025 Exit

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44)లతో పాటు నమన్ ధీర్(18 బంతుల్లో 7 ఫోర్లతో 37) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, మార్కస్ స్టోయినీస్, విజయ్‌కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు

అనంతరం పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్‌తో పాటు నెహాల్ వధేరా(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), జోష్ ఇంగ్లీస్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Monday, June 2, 2025, 11:01 [IST]
Other articles published on Jun 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+