Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గొప్ప ఊరట: హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌‌లపై నిషేధం ఎత్తివేత

India Vs New Zealand 2019 : Hardik Pandya Joins India Team For New Zealand Tour | Oneindia Telugu
Hardik Pandya and KL Rahuls suspensions revoked by Committee of Administrators

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కి గొప్ప ఊరట కలిగించే అంశం. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన ఈ ఇద్దరిపై ఉన్న సస్పెన్షన్‌‌ని ఎత్తివేస్తున్నట్లు బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) గురువారం ప్రకటించింది. దీంతో వీరిద్దరూ న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లేందుకు మార్గం సుగుమమైంది.

నిరాకరించిన సుప్రీం కోర్టు

నిరాకరించిన సుప్రీం కోర్టు

హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌‌లను విచారించి తుది నిర్ణయం తీసుకునేందుకు వెంటనే అంబుడ్స్‌మన్‌ను నియమించాలని బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. కోర్టు సహాయకుడిగా మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సింహను మాత్రమే నియమించి ఇప్పటికిప్పుడు అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

నిషేధం ఎత్తివేత

నిషేధం ఎత్తివేత

తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టడంతో అతనితో చర్చించే సస్పెన్షన్‌‌ని ఎత్తివేసినట్లు కమిటీ ప్రకటించింది. నిషేధం కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు వీరిద్దరూ దూరమైన సంగతి తెలిసిందే. తొలుత వారిద్దరిపై రెండు వన్డేల నిషేధం విధించాలని సీవోఏ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌ భావించాడు. అయితే సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహా కోరడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోకి ఇటీవల హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా "నేను ఈ మధ్యకాలంలో మూడు విషయాలను తెలుసుకున్నా. మొదటి విషయం ఏంటంటే.. ఒక అమ్మాయిని చూడటం. రెండోది డేటింగ్‌. మూడోది రిలేషన్‌షిప్‌" అని సమాధానమిచ్చాడు.

పెద్ద ఎత్తున విమర్శలు

పెద్ద ఎత్తున విమర్శలు

మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ వివాదాస్పదంగా చెప్పుకొచ్చాడు. ఈ షో ఇటీవల ప్రసారంకాగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పాండ్యా ట్విట్టర్‌లో క్షమాపణ కూడా చెప్పాడు. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడ్డారు.

Story first published: Thursday, January 24, 2019, 18:26 [IST]
Other articles published on Jan 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+