For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘కాఫీ విత్‌ కరణ్‌ షో’ వ్యాఖ్యలు: పాండ్యా, రాహుల్‌పై కేసు నమోదు

A Case Has Been Filed Against Rahul And Pandya In Jodhpur Court | Oneindia Telugu
Hardik Pandya, KL Rahul, Karan Johar in trouble: Case registered in Jodhpur court for comments on Koffee with Karan

హైదరాబాద్: 'కాఫీ విత్‌ కరణ్‌ షో' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదం టీమిండియా క్రికెటర్లు హర్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లను ఇప్పట్లో వదిలేలా లేదు. తాజాగా పాండ్యా, రాహుల్‌తో పాటు షో నిర్వాహకుడు, కరణ్‌ జోహర్‌లపై జోధ్‌పూర్ కోర్టులో కేసు నమోదైంది. ఈ మేరకు ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్(ఏఎన్ఐ) తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

వివరాల్లోకి వెళితే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌తో పాటు షో నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్‌కు చెందిన డీఆర్‌ మెఘవాల్‌ అనే వ్యక్తి జోద్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకున్న జోధ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోకి ఇటీవల హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా "నేను ఈ మధ్యకాలంలో మూడు విషయాలను తెలుసుకున్నా. మొదటి విషయం ఏంటంటే.. ఒక అమ్మాయిని చూడటం. రెండోది డేటింగ్‌. మూడోది రిలేషన్‌షిప్‌" అని సమాధానమిచ్చాడు.

కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరించి కేఎల్ రాహుల్

కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరించి కేఎల్ రాహుల్

మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ వివాదాస్పదంగా చెప్పుకొచ్చాడు. ఈ షో ఇటీవల ప్రసారంకాగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పాండ్యా ట్విట్టర్‌లో క్షమాపణ కూడా చెప్పాడు. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడ్డారు. దీంతో వీరిద్దరిపై నిషేధం విధిస్తూ బీసీసీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

నిషేధం ఎత్తివేత

నిషేధం ఎత్తివేత

అంతేకాదు వీరిద్దరిని ఆస్ట్రేలియా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించింది. తొలుత బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టాలని భావించినప్పటికీ, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టడంతో వీరిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కోర్టు సహాయకుడిగా మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సింహ బాధ్యతలు చేపట్టడంతో అతనితో చర్చించి వీర్దదరిపై ఉన్న సస్పెన్షన్‌‌ని సీఓఏ ఎత్తివేసింది.

న్యూజిలాండ్ పర్యటనలో పాండ్యా

న్యూజిలాండ్ పర్యటనలో పాండ్యా

నిషేధం ఎత్తివేత అనంతరం హార్ధిక్ పాండ్యా న్యూజిలాండ్‌ పర్యటనలో పాల్గొనడంతో పాటు ఐదో వన్డేలో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు రాహుల్‌ భారత్‌-ఏ జట్టు తరపున ఇంగ్లండ్‌ బ్లూ జట్టుతో ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ముగిసిపోయిందనుకున్న ఈ వివాదంపై మళ్లీ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.

Story first published: Wednesday, February 6, 2019, 11:35 [IST]
Other articles published on Feb 6, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+