For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకైనా, గుజరాత్‌కైనా.. నాలుగో స్థానానికి అతనే కరెక్ట్

hardik pandya is good for 4th place

ఐపీఎల్ - 2022లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. జట్టులో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. మంచి ఇన్సింగ్స్‌లు ఆడుతూ గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాధ్యతాయుతమైన రీతిలో అతని ప్రదర్శన ఉంది. పాండ్యా ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. పాండ్యా భారత జట్టుతో ఉన్నప్పుడు ఎంఎస్ ధోనీ నుంచి మంచి పాఠాలు నేర్చుకుని ఉండొచ్చన్నాడు. ఆ పాఠాలను ప్రస్తుత ఐపీఎల్లో సరిగ్గా అమలు చేస్తున్నాడంటూ కితాబిచ్చాడు. స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. 'హార్దిక్ పాండ్యా ధోనీకి బాగా సన్నిహితుడు. ధోనీని తన మెంటర్‌గా భావిస్తాడు. వైట్-బాల్ క్రికెట్ చరిత్రలో ధోనీ లాంటి ఫినిషర్, కెప్టెన్ ఎవరూ లేరు. ధోనీ నుంచి సరైన పాఠాలనే హార్దిక్ నేర్చుకున్నాడు. హార్దిక్ గుజరాత్ టైటాన్స్ తరఫున వ్యవహరిస్తున్న విధానాన్ని గమనిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది.' అన్నాడు.

హార్దిక్ పాండ్యా తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెంచడాన్ని, అతని ఆలోచన విధానాన్ని సునీల్ గవాస్కర్ కొనియాడాడు. 'ఐపీఎల్‌కు ముందు హార్దిక్ ఎక్కువ క్రికెట్ ఆడలేదు, గాయం వల్ల క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో అతను తన ఆలోచన విధానాన్ని మార్చుకుని పూర్తి ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. బ్యాటింగ్‌లో అతను చూపిస్తున్న క్రమశిక్షణే దీనికి అద్దంపడుతుంది. అతను పవర్‌ప్లేలో బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫీల్డింగ్ పరిమితులను సమర్థంగా ఉపయోగించుకుంటున్నాడు. అలాగే.. అతని థింకింగ్ కూడా బాగా మెరుగైంది' అన్నాడు.

hardik pandya is good for 4th place

భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం హార్దిక్ ప్రస్తుత ఆటతీరును ప్రశంసించాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హార్దిక్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన వస్తోందని తెలిపాడు. అతనిలో కొత్త వర్షన్‌ను కెప్టెన్సీ బయటపెట్టిందన్నాడు. హార్దిక్‌లోని మంచి విషయం ఏంటంటే.. అతను నంబర్ 4లో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రారంభంలో వికెట్లు పడిపోయిన తర్వాత హార్దిక్ బౌలర్లపై అటాక్ చేయట్లేదు. ఇన్నింగ్స్ ప్రారంభంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. బౌలర్లు పట్టు సడలించిన తర్వాత మాత్రమే హిట్టింగ్ చేస్తున్నాడు. నా అభిప్రాయం మేరకు.. టీమిండియాకైనా, గుజరాత్ టైటాన్స్‌కు అయినా హార్దిక్ నాలుగో నంబర్‌లో అత్యంత ప్రభావవంతమైన బ్యాట్స్‌మన్. ఆ స్థానానికి అతను న్యాయం చేయగలడు. అని పేర్కొన్నాడు.

Story first published: Sunday, April 24, 2022, 17:30 [IST]
Other articles published on Apr 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+