For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'చెప్పుకోవడానికే పాండ్యా ఆల్ రౌండర్, ఒక్క సెంచరీ కూడా చేయలేదు'

Hardik Pandya is lucky to get viewed as an allrounder: Roger Binny

హైదరాబాద్: హార్ధిక్ పాండ్యా ప్రదర్శనపై భారత మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ మండిపడుతున్నాడు. అదృష్టవశాత్తు ఆల్ రౌండర్ అని పిలిపించుకుంటున్నాడే తప్ప అతని ప్రదర్శన అంతగా ఏమీ బాగా లేదన్నాడు. అన్ని ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్‌తో వరుసగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాని ఆల్‌రౌండర్‌గా ఎలా పిలుస్తారని భారత మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ ప్రశ్నించారు.

'బ్యాట్‌తో విఫలమవుతున్నా.. బంతితో ఫర్వాలేదనిపిస్తున్నాడు కాబట్టే.. అతను ఇంకా జట్టులో కొనసాగుతున్నాడు. టీ20ల్లో కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం ద్వారా టెస్టుల్లోకి రాగలిగాడు. కానీ.. వన్డే, టీ20లతో పోలిస్తే.. ఐదు రోజుల సుదీర్ఘ ఫార్మాట్‌ తీరు వేరనే విషయాన్ని అతను గుర్తించాలి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొద్దిసేపటికే ఫీల్డర్లు బ్యాట్స్‌మెన్‌కి దూరంగా వెళ్తారు. అప్పుడు పరుగులు సాధించొచ్చు. కానీ.. టెస్టుల్లో అలా కాదు' అంటూ పాండ్యా ఆటతీరును విశ్లేషించాడు.

టీ20ల్లో హిట్టింగ్ చేయడం ద్వారానే టెస్టుల్లో హార్దిక్ చోటు దక్కించుకున్నాడే తప్ప.. అతడ్ని ఓ ఆల్‌రౌండర్‌గా కెప్టెన్ విరాట్ కోహ్లి చూడటం లేదన్నాడు. ఇకనైనా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం ద్వారా హార్దిక్ తన ఆటని మెరుగుపర్చుకుంటే మంచిదని బిన్నీ సూచించాడు.

'హార్దిక్ పాండ్య దక్షిణాఫ్రికా‌తో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్‌లో కేవలం తొలి టెస్టులోనే 93 పరుగులు చేశాడు. మిగిలిన అన్ని ఇన్నింగ్స్‌లోనూ సాధారణ ప్రదర్శన మాత్రమే చేయగలిగాడు' బ్యాట్‌తో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడని బిన్నీ గుర్తుచేశాడు.

'ఇక గత ఏడాదికాలంగా దిగ్గజ ఆల్‌‌రౌండర్ కపిల్‌దేవ్‌తో హార్దిక్ పాండ్యాని పోల్చుతున్నారు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే.. భారత్ జట్టుకి ఆడకముందే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కపిల్‌దేవ్ సెంచరీలు బాదాడు. కానీ.. హార్దిక్ పాండ్య ఫస్ట్ క్లాస్, వన్డే క్రికెట్‌లో కనీసం ఇప్పటి వరకు ఒక సెంచరీ కూడా కొట్టలేకపోయాడు' అని రోజర్ బిన్నీ గుర్తుచేశాడు.

ఇప్పటి వరకు ఆరు టెస్టుల్లో ఆడిన పాండ్యా ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. 38 వన్డేల్లో 4హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ, ఒక్క టీ20ల్లోనూ హాఫ్ సెంచరీని ఇప్పటి వరకు నమోదు చేయలేకపోయాడు.

Story first published: Thursday, February 22, 2018, 17:45 [IST]
Other articles published on Feb 22, 2018
Read in English: Binny slams Hardik Pandya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+