Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వచ్చేస్తున్నా.. ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ సిద్ధమేనా? - హార్దిక్ (వీడియో)

ప్రపంచకప్‌లో గాయపడి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అయితే గాయం నుంచి హార్దిక్ వేగంగా కోలుకుంటున్నాడు. దాదాపు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్టుగానే కనిపిస్తున్నాడు. జిమ్‌లో పవర్‌ఫుల్‌గా కసరత్తులు చేస్తూ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకున్నాడు. ప్రతిరోజు పురోగతి సాధిస్తున్నానంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. హార్దిక్ కోలుకోవడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అతడి పోస్ట్‌కు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా రియాక్ట్ అయ్యాడు. వేగంగా కోలుకోమని కామెంట్ చేశాడు. కాగా, ఇటీవల ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మను కాదని గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి ముంబయి గూటికి చేరిన హార్దిక్‌కు సారథి బాధ్యతలు అందించారు.

Hardik Pandya is Coming. Are Mumbai Indians fans ready- Hardik Pandya Video goes viral

అయితే హార్దిక్ ట్రేడింగ్ వెనుక మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ స్టార్ ఆల్‌రౌండర్ కోసం ముంబయి ఇండియన్స్ దాదాపు రూ.100 కోట్లు చెల్లించిందని సమాచారం. అయితే బదిలీ రుసుము ముంబయి ఎంత మొత్తం చెల్లించిందనే విషయం ఐపీఎల్ నిర్వాహకులకు మాత్రమే తెలుసు. ఈ ఆర్థిక సంవత్సం చివరిలో గుజరాత్ సీవీ క్యాపిటల్‌ బ్యాలెన్స్ షీట్‌లో అది కనిపించనుంది.

కాగా, అఫ్గానిస్థాన్ సిరీస్‌కు హార్దిక్ పాండ్య అందుబాటులో ఉన్నా అతడిని పక్కనపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వదేశంలో జనవరి 11 నుంచి అఫ్గాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టీమిండియా అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అనంతరం వరుసగా ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్, పనిభారం గురించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

Story first published: Tuesday, January 2, 2024, 18:25 [IST]
Other articles published on Jan 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+