For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్ధిక్ పాండ్యా నా కంటే ప్రతిభావంతుడు: కపిల్ దేవ్

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రస్తుతం భారత క్రికెట్‌లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు హార్ధిక్ పాండ్యా. ఆసీస్‌తో ఇప్పటివరకు ముగిసిన మూడు వన్డేల్లో రెండు మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టుకు హార్దిక్‌ పాండ్యా రూపంలో కపిల్‌దేవ్‌ లాంటి ఆల్‌రౌండర్‌ దొరికాడని పలువురు మాజీలు కొనియాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ స్పందించాడు. 'పాండ్యా నాకంటే ప్రతిభావంతుడు. అతనికి ఉన్న ప్రతిభ, సామర్థ్యంతో భవిష్యత్తులో జట్టులో మరింత కీలకంగా మారతాడు' అని అన్నాడు.

'రాబోయే రోజుల్లో పాండ్యా ఎన్నో ఘనతలు అందుకుంటాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటి నుంచే అతడిపై ఒత్తడిని పెంచొద్దు. అద్భుతమైన ప్లేయర్‌కు కావాల్సిన లక్షణాలు పాండ్యాలో పుష్కలంగా ఉన్నాయి. అతడు చేయాల్సిందల్లా ఒకటే.. మరింత కష్టపడటం' అని కపిల్ అన్నాడు.

Hardik Pandya is better than me, says Kapil Dev

కాగా, ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ పరుగులు రాబడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు ముగిసేసరికి పాండ్యా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇప్పటివరకు పాండ్యా భారత్ తరుపున 3 టెస్టులు, 24 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 178 పరుగులు చేయగా, వన్డేల్లో 489, టీ20ల్లో 100 పరుగులు చేశాడు. అలానే బౌలింగ్‌లో కూడా పాండ్యా తన ప్రతిభను కనబర్చాడు. టెస్టుల్లో 4, వన్డేల్లో 28, టీ20ల్లో 15 వికెట్లు తీశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+