
అతనో సూపర్ స్టార్
పాండ్యా ఒక సూపర్ స్టార్ అని చెప్పిన కేన్ విలియమ్సన్.. అతనో అద్భుతమైన ఆటగాడని కొనియాడాడు. అతనో ఆల్‌రౌండర్ కూడా కావడంతో చాలా మంది పాండ్యాను జట్టులో ఉంచుకోవాలని అనుకుంటారని అన్నాడు. 'పాండ్యా ప్రత్యర్థిగా చాలా క్రికెట్ ఆడాను. ఐపీఎల్‌లో కూడా అతనికి మంచి రికార్డు ఉంది. ఇక కెప్టెన్సీ అంటే రోహిత్, విరాట్ వంటి వాళ్ల సపోర్ట్ ఈ విషయంలో చాలా కీలకం' అని చెప్పాడు.

అనుభవం బాగుంది..
గాయం నుంచి కోలుకున్న తర్వాత అదరగొడుతున్న పాండ్యా.. కెప్టెన్‌గా తనేంటో నిరూపించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ సారధిగా తొలి సీజన్‌లోనే కప్పు కొట్టిన పాండ్యా.. ఆ తర్వాత ఐర్లాండ్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు మరోసారి న్యూజిల్యాండ్ గడ్డపై భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే టీ20 ప్రపంచకప్‌లో కూడా జట్టుకు అతనే సారధ్యం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కొత్త టీమిండియా గట్టిదే..
కివీస్‌తో సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బడా ప్లేయర్లకు విశ్రాంతినిచ్చారు. అయితే కొత్త టీమిండియా కూడా గట్టి జట్టేనని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. 'భారత క్రికెట్‌లో చాలా డెప్త్ ఉంది. అది మనం అంతర్జాతీయ క్రికెట్‌లో చాలాసార్లు చూశాం. టీమిండియాలో కొత్త ముఖాలు ఉన్నా.. వాళ్లలో దాదాపు అందరూ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లే. ఆ జట్టులో ఉన్న ట్యాలెంట్ అందరికీ కనబడుతోంది. ఈ జట్టు బలమైనదే' అని కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు.


Click it and Unblock the Notifications
