Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్కడ సూపర్ హిట్- ఇక్కడ అట్టర్ ఫ్లాప్

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం పంజాబ్ కింగ్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది వారికి వరుసగా నాలుగో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (60 బంతుల్లో 112 పరుగులు నాటౌట్) అద్భుత శతకం సాధించినా, జట్టు విజయం సాధించలేకపోయింది. డికాక్, నమన్ ధీర్ (50) తో 68 బంతుల్లో 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

పంజాబ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 22 పరుగులకి మూడు వికెట్లు తీయగా, శశాంక్ సింగ్ ఒక వికెట్ పడగొట్టారు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై బౌలర్ అల్లా గజన్‌ఫర్ రెండు వికెట్లు తీసినా అది జట్టుకు విజయానికి సరిపోలేదు. పంజాబ్ విజయంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (39 బంతుల్లో 80 పరుగులు నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 66 పరుగులు) కీలక పాత్ర పోషించారు. మూడో వికెట్ కోసం 67 బంతుల్లో 139 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Hardik Pandya IPL Captaincy Tale in Gujarat Titans Golden Run vs Mumbai Indians Rocky Start Tale

ఐపీఎల్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ప్రస్థానం గుజరాత్ టైటాన్స్‌తో పోలిస్తే ముంబై ఇండియన్స్ టీమ్‌లో పూర్తి భిన్నమైన ఫలితాలను చూపిస్తోంది. గుజరాత్‌ టైటాన్స్ కు మొదటి సీజన్ లోనే టైటిల్‌కు అందించిన ఘనత అతనికి ఉంది. 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కేప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్.. అదే ఏడాది టీమ్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. అద్భుత విజయాలను అందించాడు. జట్టును ముందుకు నడిపించాడు.

గుజరాత్ టైటాన్స్ తరఫున పాండ్యా కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన 2022లో జట్టు తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2023లో రన్నరప్‌గా నిలిచింది. ఈ 31 మ్యాచ్‌లలో పాండ్యా 22 విజయాలతో 70.97 గెలుపు శాతాన్ని సాధించాడు. ఆల్‌రౌండర్‌గా 833 పరుగులు, 11 వికెట్లు పడగొట్టాడు. 2024లో ముంబై ఇండియన్స్‌లోకి పాండ్యా తిరిగి రాగా, అతని కెప్టెన్సీలో జట్టు నిరాశపరిచింది. 2024లో చివరి స్థానంలో నిలవగా, 2025లో ప్లేఆఫ్స్‌కు చేరింది.

ఇప్పుడు మళ్లీ నాలుగు వరుస ఓటములతో సవాళ్లు ఎదురయ్యాయి. ముంబై తరఫున 33 మ్యాచ్‌లలో 14 విజయాలు, 19 ఓటములతో అతని విజయం కేవలం 42.42శాతం. రెండు జట్లలో కెప్టెన్‌గా పాండ్యా మొత్తం 64 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. 36 విజయాలు, 28 ఓటములతో అతని కెరీర్ గెలుపు శాతం 56 శాతంగా ఉంది. ఈ టోర్నమెంట్ లో ఇంకా మున్ముందు ముంబై ఇండియన్స్ ఎలా పుంజుకొంటుందనేది అతని వ్యూహాలపై ఆధారపడి ఉంది.

Story first published: Friday, April 17, 2026, 12:27 [IST]
Other articles published on Apr 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+