For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాలిలో టీమిండియా.. యాంకర్‌గా మారిన పాండ్యా..!!

Hardik Pandya interviews Virat Kohli, MS Dhoni mid-air on flight to UK

హైదరాబాద్: విదేశీ పర్యటనకు తాము వంద శాతం సిద్ధంగా ఉన్నామని, తానైతే 110శాతం ఫిట్‌గా ఉన్నానని టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఐర్లాండ్ పర్యటనకు ముందు మీడియా సమావేశంలో చెప్పాడు. అంతటి ధీమాతో బయల్దేరిన టీమిండియా.. కేవలం ఐర్లాండ్‌తోనే కాదు ఇంగ్లాండ్‌తోనూ పోటీపడి విజయం చేజిక్కించుకోవాలనే నమ్మకంతో ఉంది. ఈ క్రమంలో ఐర్లాండ్ బయల్దేరిన టీమిండియా ఆటగాళ్లను పాండ్యా సరదాగా చేసిన ఇంటర్వ్యూలో వాళ్ల అభిప్రాయాలను ఇలా చెప్పుకొచ్చారు.

పాండ్య, చాహల్‌ కలిసి సహచర ఆటగాళ్లను

పాండ్య, చాహల్‌ కలిసి సహచర ఆటగాళ్లను

విమానంలో ఆటగాళ్లు ఎంతో సందడి చేశారు. హార్దిక్‌ పాండ్య వ్యాఖ్యాతగా మారి జట్టు సభ్యులను, మేనేజ్‌మెంట్‌ సిబ్బందిని ఇంటర్వ్యూ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. విమానంలో ఆటగాళ్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. పాండ్య, చాహల్‌ కలిసి సహచర ఆటగాళ్లను ప్రశ్నలడిగారు.

 ధోనీని ఏ ప్రశ్న అడగలేకపోయాడు..పాండ్య:

ధోనీని ఏ ప్రశ్న అడగలేకపోయాడు..పాండ్య:

వీడియోలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాండ్య.. ధోనీని ఏ ప్రశ్న అడగలేకపోయాడు. తన వద్దకు వచ్చిన పాండ్యకు ధోనీ ఒక బిస్కెట్‌ ఆఫర్‌ చేసి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. దీంతో పాండ్య.. ధోనీని వదిలేసి పక్కనే ఉన్న ధావన్‌ వద్దకు వెళ్లాడు. ‘ఇదంతా ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే' అంటూ పాండ్య చివర్లో తన యాంకరింగ్‌ను ముగించాడు. ముందుగా పాండ్య.. తన వ్యాఖ్యానాన్ని కెప్టెన్‌ కోహ్లీ నుంచి ప్రారంభించాడు.

ఇంగ్లాండ్‌ పర్యటనకు 3 సార్లు వెళ్లా:

ఇంగ్లాండ్‌ పర్యటన గురించి కోహ్లీని అడగ్గా.. ‘ఇప్పటి వరకు మూడుసార్లు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లాను. మీ అందరితో కలిసి వెళ్లడం ఎంతో సంతోషంగా ఉంది. ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని బదులిచ్చాడు. మనీశ్‌ పాండే హెయిర్‌ స్టైల్‌పై సరదా వ్యాఖ్యలు చేసుకున్నారు. అనంతరం తమకు యో యో టెస్టు నిర్వహించేది ఎవరో చూపించాడు పాండ్య. దినేశ్‌కార్తీక్‌ వద్దకు వెళ్లి ఏమన్నా మాట్లాడమని అడిగితే.. హార్దిక్‌ పాండ్య ‘డాన్‌' అని అన్నాడు.

చాహల్‌కు చెమటెక్కువ అందుకే దూరంగా:

చాహల్‌కు దూరంగా ఉండేందుకు తానెప్పుడూ పరిగెడుతూ ఉంటానని... ఎందుకంటే అతనికి చెమటెక్కువని అన్నాడు రోహిత్‌ శర్మ. మరికొంత మంది సభ్యులు ధావన్‌, బుమ్రా, చాహల్‌ ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Story first published: Tuesday, June 26, 2018, 18:44 [IST]
Other articles published on Jun 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+