న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు మరో ఎదురుదెబ్బ: ఐదు నెలలు క్రికెట్‌కు దూరం కానున్న హార్ధిక్ పాండ్యా!

Hardik Pandya Injury: May Undergo A Back Surgery in UK And Keep Him Out of Action For Five Months

హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ నుంచి వైదొలిగిన కొద్ది రోజులకే టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇండియా ఫస్ట్ ఛాయిస్ ఆల్ రౌండర్‌ హార్ధిక్ పాండ్యా వెన్ను గాయంతో సుమారు ఐదు నెలలు పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు.

గత సెప్టెంబర్‌లో దుబాయి వేదికగా జరిగిన ఆసియా కప్‌లో తొలిసారి వెన్నునొప్పికి గురైన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత పలు సిరిస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా, పాండ్యా వెన్నుపూస కింది భాగంలో గాయం మళ్లీ తిరగబెట్టిందని సమాచారం. దీంతో అతడు త్వరలోనే లండన్‌కు పయనం కానున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్‌ ఆడుతుండగా హార్దిక్‌ వెన్ను గాయంతో బాధపడ్డాడు. నొప్పి భరించలేక నేలపై విలవిల్లాడిన సంగతి తెలిసిందే.

Watch: 'బేబీ షార్క్' జీవాతో పూల్‌లో ధోని: పక్కనే హార్దిక్ పాండ్యా Watch: 'బేబీ షార్క్' జీవాతో పూల్‌లో ధోని: పక్కనే హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "ఆసియా కప్ తర్వాత తొలిసారి గాయపడినప్పుడు ఎవరైతే డాక్టర్ పాండ్యాకు చికిత్స అందించాడో అదే వైద్యుడిని మళ్లీ సంప్రదించడానికి హార్దిక్ యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లనున్నాడు. పాండ్యా ఖచ్చితంగా బంగ్లాదేశ్ సిరీస్ ఆడటం లేదు. అయితే, అతడు ఎంతకాలం క్రికెట్‌కు దూరమవుతాడో ఇంకా స్పష్టంగా తెలియలేదు. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది" అని అన్నారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వైద్యులను సంప్రదించిన తర్వాత హార్దిక్‌ పాండ్యాను జర్మనీని పంపే ఆలోచనలో కూడా బీసీసీఐ ఉంది. ఒకవేళ పాండ్యాకి సర్జరీ గనుక చేయాల్సి వస్తే అతడు ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కూడా హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకోలేపోయాడు. కూర్పులో భాగంగా హార్దిక్‌ టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వని సంగతి తెలిసిందే. అంతేకాదు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో కూడా బరోడా జట్టు తరుపున ఆడటం లేదు. దీంతో ఐపీఎల్ 2020 ప్రారంభమయ్యే నాటికి జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి.

పాండ్యా vs పాండ్యా: తలకు తగిలేలా బంతిని బాదాడు (వీడియో)పాండ్యా vs పాండ్యా: తలకు తగిలేలా బంతిని బాదాడు (వీడియో)

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యా కీలక ఆటగాడిగా ఉన్నాడు. దీంతో పాండ్యాకు టెస్టు క్రికెట్ కంటే కూడా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనే ఎక్కువ అవకాశాలు కల్పించాలని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ భావిస్తున్నారు. కాగా, భారత్ తరుపున ఇప్పటివరకు 11 టెస్టులాడిన పాండ్యా 532 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టాడు.

54 వన్డేలాడి 937 పరుగులు చేయడంతో పాటు 54 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, భారత్ తరుపున 40 టీ20 మ్యాచ్‌లాడి 310 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, October 1, 2019, 19:38 [IST]
Other articles published on Oct 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X