పాండ్యాతో మంచి స్నేహం ఉంది: విజయ్ శంకర్

హైదరాబాద్: ఇప్పటి వరకు టీమిండియా తరుపున అల్ రౌండర్ కోటాలో పాండ్యాకు తిరుగు లేని స్థానం ఉంది. ఇప్పటికే ఉందనే చెప్పాలి. అయితే రీసెంట్‌గా వచ్చిన విజయ్ శంకర్ రూపంలో హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం దొరికిందని చెప్పాలి. విజయ శంకర్ రూపంలో జట్టులో కొత్త తల నొప్పి వచ్చిందనే చెప్పాలి. 2019 వరల్డ్ కప్‌కు పాండ్యాతో టఫ్ కాంపిటీషన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

బ్యాటింగ్‌తో అలరించిన విజయ్ శంకర్
అయితే న్యూజిలాండ్‌పై ఆడిన టీ20, వన్డే సిరిస్ అన్నిటింట్లో విజయ శంకర్ కూడా బ్యాటింగ్‌తో అలరించాడు. దీనితో ఇద్దరు అల్ అరౌండర్లు కావటంతో ఇప్పడూ కళ్ళు అన్ని విజయ శంకర్ మీద పడ్డాయి. అయితే విజయ్ శంకర్ మాత్రం నాకు , పాండ్యా కు ఎటువంటి పోటీ వాతావరణం లేదని చెప్పుకొచ్చాడు. బయటి నుంచి చూసే వారికి అలా అనిపించి ఉండొచ్చు కానీ మా మధ్య స్నేహపూర్వక సంబంధం ఉందని తెలిపాడు.

పాండ్యాతో చాలా విషయాలు చర్చిస్తా
"నేను , హార్థిక్ పాండ్యా ఇద్దరం కలిసి న్యూజిలాండ్ మీద ఆడాం. చాలా విషయాలను కలిసి చర్చించుకుంటాం" అని తెలిపాడు. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ గురించి బ్యాట్స్ మెన్‌ను ఇబ్బంది పెట్టె బౌలింగ్ గురించి చర్చిస్తామని తెలిపాడు. ఇంకా ప్రపంచ గురించి ఆలోచించడం లేదని , రాబోయే ఆస్ట్రేలియా టూర్ మీద తన ప్రధాన ద్యాసంతా ఉందని తెలిపాడు.

సెలక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు
"సెలక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ప్రపంఛ కప్ గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఇప్పుడు నా శ్రద్ద అంత కేవలం నా అట మీదే అని ప్రతి రోజు ఎంతో కొంత నా ప్రాక్టీస్ నుంచి నేర్చుకుంటాను" అని విజయ్ శంకర్ అన్నాడు. మరోవైపు శంకర్‌కు బౌలింగ్ కంటే బ్యాటింగ్‌లోనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.

ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తా
జట్టు మేనేజ్‌మెంట్ శంకర్‌ను బౌలర్‌గా కంటే అల్ రౌండర్ గా చూస్తుందని చెప్పాలి. ఈ ప్రశ్నకు గాను "జట్టు నన్ను బౌలర్‌గా చూస్తుందా, బ్యాట్సమెన్‌గా చూస్తుందా అని ఆలోచించడం లేదని, మేనేజ్‌మెంట్ నాకు ఎటువంటి భాద్యతలను ఇచ్చిన వాటిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానని, దాని కోసం నేను కష్ట పడుతున్నాను" అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications