Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ దగ్గరికి వెళ్లిన హార్దిక్.. అగ్గిపెట్టి మచ్చాతో మీమ్స్ (Video)

ఎట్టకేలకు రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్య కలుసుకున్నారు. ఒకరినొకరు హగ్ చేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. కెప్టెన్సీ మార్పు తర్వాత వారిద్దరు కలుసుకోవడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వన్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ట్రేడింగ్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ముంబై ఇండియన్స్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండు సార్లు గుజరాత్‌ను ఫైనల్‌కు, అందులో ఒక్కసారి ఆ జట్టును విజేతగా నిలిపిన హార్దిక్‌ ముంబై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులకు ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌కు సారథి బాధ్యతలు అందించింది.

Hardik Pandya goes to Rohit Sharma and hugs him Viral memes comparing it with aggipetti machha

దీంతో హార్దిక్ పాండ్యపై నెట్టింట్లో వ్యతిరేకత వచ్చింది. కెప్టెన్సీ కోసమే గుజరాత్‌ను వదిలి ముంబైకి తిరిగొచ్చాడని హార్దిక్‌పై ఆరోపణలు మొదలయ్యాయి. హార్దిక్‌ను రోహిత్ అభిమానులు నెట్టింట్లో, బయటా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఏదైనా సమావేశాల్లో హార్దిక్ హాజరైనా కెప్టెన్సీ ప్రశ్నలతో ముంచెత్తారు. హార్దిక్ ఎంత సర్దిచెప్పినా రోహిత్ ఫ్యాన్స్‌ కెప్టెన్సీ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో హార్దిక్-రోహిత్ ఒకటయ్యారని ముంబై ఇండియన్స్ తమ ఫ్యాన్స్‌కు పరోక్షంగా సందేశాన్ని పంపింది. ప్రాక్టీస్ సెషన్‌లో వారిద్దరు కలుసుకోని, మాట్లాడుకున్న వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఇది స్క్రిప్టెడ్ వీడియో అని, ఫోర్సబుల్‌గా హగ్ చేసుకున్నారని, ఫేక్ స్మైల్‌తో ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హార్దిక్‌తో రోహిత్ అసక్తితో మాట్లాడుతున్నట్లు కనిపించట్లేదని వాదన వినిపిస్తున్నారు. దానికి తోడు ఫన్నీ మీమ్స్ పోస్టు చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్ అగ్గిపెట్టి మచ్చా ఫన్నీ వీడియో‌‌స్‌తో పోలుస్తూ ఇదే రియాల్టీ అని అంటున్నారు.

కాగా, మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇక ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ మార్చి 24న జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో పోటీపడనుంది. సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధించలేదు. మరోవైపు బుమ్రా జట్టుతో ఇంకా చేరలేదు.

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్య (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, శివాలిక్ శర్మ, క్వెనా మపాకా.

Story first published: Thursday, March 21, 2024, 9:39 [IST]
Other articles published on Mar 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+