న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెర్బియా నటితో హార్దిక్‌ పాండ్యా డిన్నర్.. పెళ్లి చేసుకోబోతున్నాడా?!!

Hardik Pandya goes for a dinner date with Natasha Stankovic in Mumbai, Affair rumours get strong


ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆటకన్నా.. ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా డేటింగ్ విషయాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. గతంలో ఎల్లీ అవ్రామ్, ఊర్వశీ రౌటేలా, ఈషా గుప్తాలతో హార్దిక్ డేటింగ్ చేశాడు. తాజాగా సెర్బియా మోడల్‌, డాన్సర్ నటనా స్టాన్‌కోవిచ్‌తో హార్దిక్‌ ప్రేమాయణం నడుపుతున్నాడట.

ఐదేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ నెగ్గిన విండీస్‌.. అఫ్గాన్‌కు వరుసగా 11 వన్డే ఓటమి!!ఐదేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ నెగ్గిన విండీస్‌.. అఫ్గాన్‌కు వరుసగా 11 వన్డే ఓటమి!!

స్టాన్‌కోవిచ్‌తో డిన్నర్:

స్టాన్‌కోవిచ్‌తో డిన్నర్:

నటాషా స్టాన్‌కోవిచ్‌తో హార్దిక్‌ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. గతంలో ఎఫైర్లను డేటింగ్‌ వరకే పరిమితం చేసిన హార్దిక్‌.. ఈసారి సీరియస్‌గా స్టాన్‌కోవిచ్‌ను ప్రేమిస్తున్నాడట. శస్త్రచికిత్స అనంతరం కుటుంబం, స్నేహితులతో ఎక్కువగా గడుపుతున్న హార్దిక్‌.. తాజాగా ముంబై జుహులోని ఒక హోటల్‌కు స్టాన్‌కోవిచ్‌తో కలిసి డిన్నర్ చేసాడట. ఈ ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరికీ పరిచయం కూడా చేశాడట.

పెళ్లి చేసుకోబోతున్నాడా?:

పెళ్లి చేసుకోబోతున్నాడా?:

స్టాన్‌కోవిచ్‌-హార్దిక్‌ల డిన్నర్, పార్టీలు చూస్తుంటే త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చని అతని సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు నటాషాను హార్దిక్‌ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టే వారి వ్యవహారం ఇంటివరకూ వచ్చిందని క్రికెట్‌ వర్గాలు, సినీ వర‍్గాలు కోడై కూస్తున్నాయి. పాండ్యా సోదరుడు కృనాల్ కూడా వీరి పెళ్ళికి ఓకే చెప్పాడట.

అభిమానులకు విజ్ఞప్తి:

అభిమానులకు విజ్ఞప్తి:

డ్యాన్సర్ స్టాన్కోవిక్‌ రియాలిటీ డ్యాన్స్ షో 'నాచ్ బలియే'లో పాల్గొంది. స్టాన్కోవిక్‌ తన మాజీ ప్రియుడు, నటుడు అలీ గోనితో కలిసి రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. నాచ్ బలియే తొమ్మిదో సీజన్‌లో తన ప్రేయసి గెలవాలనే తపనతో హార్దిక్ నటాషాకు మద్దతు ఇచ్చాడు. హార్ధిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నటాషా, అలీల ఫొటో షేర్ చేసి వారిని గెలిపించాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు.

శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతి:

శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతి:

హార్దిక్ పాండ్యా ఇటీవలే లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్‌, ట్రైనర్స్‌ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్‌ ఆడుతుండగా హార్దిక్‌ వెన్నునొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స కారణంగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు అతడు దూరమయ్యాడు.

 'డీజే వాలే బాబు'తో గుర్తింపు:

'డీజే వాలే బాబు'తో గుర్తింపు:

నటాషా స్టాన్కోవిక్‌ తొలుత బాలీవుడ్‌లోకి ఐటమ్‌ గర్ల్‌గా అడుగుపెట్టింది. షారుక్‌ ఖాన్‌, అనుష్క శర్మ నటించిన 'జీరో' అనే మూవీలో నటాషా ఓ పాత్ర కూడా చేసింది. నటాషా మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్‌ నేర్చుకోవడం మొదలు పెట్టింది. 2010లో స్పోర్ట్స్‌ సెర్బియా టైటిల్‌ను గెలుచుకుంది. 2015లో కంపోజర్‌ బాద్‌షా రూపొందించిన హిట్‌ మ్యూజిక్‌ వీడియో 'డీజే వాలే బాబు'తో నటాషాకు మంచి గుర్తింపు వచ్చింది. ఒకవైపు మోడలింగ్‌ చేస్తూనే మరొకవైపు నటన, డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లతో నటాషా బిజీగా ఉంది.

Story first published: Sunday, November 10, 2019, 14:17 [IST]
Other articles published on Nov 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X