For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆమెకేమైనా పిచ్చా? హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్ వింత ప్రవర్తనపై నెటిజన్ల ఫైర్! (వీడియో)

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే కూడా సోషల్ మీడియాలో ఓ వింత సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఔట్ అయిన సమయంలో అతని ప్రియురాలు మహీకా శర్మ ఇచ్చిన రియాక్షన్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.

అసలేం జరిగిందంటే?
188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కష్టాల్లో ఉన్న సమయంలో హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. 17 బంతుల్లో 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. కేశవ్ మహారాజ్ వేసిన 15వ ఓవర్ మొదటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత్ గెలవాలంటే హార్దిక్ క్రీజులో ఉండటం ఎంతో అవసరం. కానీ అతను ఔట్ అయిన వెంటనే కెమెరా స్టాండ్స్‌లో ఉన్న మహికా శర్మ వైపు మళ్లింది. ఆ సమయంలో మహీకా శర్మ దిగులు పడాల్సింది పోయి, ముఖంపై నవ్వుతో చప్పట్లు కొడుతూ కనిపించింది. తన ప్రియుడు, జట్టు కీలక బ్యాటర్ ఔట్ అయినప్పుడు ఆమె అలా ఎందుకు స్పందించిందో ఎవరికీ అర్థం కాలేదు. దీనికి సంబంధించిన క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Hardik Pandya Girlfriend Mahieka Sharma Trolled for Clapping After His Dismissal Video Goes Viral

నెటిజన్ల ట్రోలింగ్
మహీకా శర్మ రియాక్షన్‌పై భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. "మనం మ్యాచ్ గెలిచామని ఆమె అనుకుంటుందా? కనీసం హార్దిక్ ఔట్ అయ్యాడనే స్పృహ కూడా ఆమెకు లేనట్టుంది" అని ఒక నెటిజన్ ఎద్దేవా చేయగా.. "ఇది అత్యంత విచిత్రమైన రియాక్షన్" అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెను 'నిబ్బి' అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

కుప్పకూలిన భారత్
హార్దిక్ ఔట్ అయిన అదే ఓవర్లో కేశవ్ మహారాజ్.. రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ వికెట్లను కూడా పడగొట్టి భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. చివరకు టీమిండియా 111 పరుగులకే ఆలౌట్ అయి 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శివం దూబే (42) ఒక్కడే పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ 4 వికెట్లతో చెలరేగాడు.

Story first published: Monday, February 23, 2026, 9:55 [IST]
Other articles published on Feb 23, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+