Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs MI: ఇషాన్ కిషన్ చెల్లికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా(వీడియో)

DC vs MI: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వర్ధమాన ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. హార్దిక్ పాండ్యా తన మనస్సులోని మాటను బహిరంగంగా చెబుతాడు. హార్దిక్ పాండ్యా ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేస్తే అది తప్పకుండా నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు. దీనికి ఓ ఉదాహరణను కూడా తాజాగా హార్ధిక్ ఇచ్చాడు. మహిళా క్రికెటర్ కు ఉచ్చిన వాగ్దానన్ని హార్దిక్ పాండ్యా నెరవేర్చాడు. ఈ ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సందర్బంగా భారత మహిళా క్రికెటర్ కాశ్వీ గౌతమ్ కు ఓ బ్యాట్ ఇస్తానని పాండ్యా హామీ ఇచ్చాడు. కాశ్వీ గౌతమ్ హార్ధిక్ పాండ్యాను తన రోల్ మోడల్ గా భావిస్తుంది. కాశ్వీ గౌతమ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడింది. డబ్ల్యూపీఎల్ లో 9 మ్యాచ్‌ల్లో 200 పరుగులు చేసింది. బౌలింగ్ లో 11 వికెట్లు పడగొట్టింది. పంజాబ్ కు చెంది కాశ్వీ గౌతమ్ ఆల్ రౌండర్ గా రాణిస్తోంది. శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కు భారత జట్టుకు ఎంపికైంది కాశ్వీ గౌతమ్.

మాట నిలబెట్టుకున్న హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముందు కాశ్వీ గౌతమ్ హార్దిక్ పాండ్యాను కలిసింది. ఈ సందర్భంగా కాశ్వీ గౌతమ్ కు ఇచ్చిన మాటను హార్దిక్ నిలబెట్టుకున్నాడు. ఆ మహిళా క్రికెటర్ కు తన బ్యాట్ ను బహిమతిగా ఇచ్చాడు. పాండ్యా కాశ్వీ గౌతమ్ ను కలిసి టీమిండియాలో ఎంపికైనందుకు అభినందించి బ్యాట్ ఇచ్చాడు. పాండ్యా ఈ బ్యాట్ తో ఆడమని చెప్పాడు. ఈ బ్యాట్ నచ్చకపోతే తిరిగి ఇవ్వమని.. తాను ఇంకొకటి ఇస్తానని కాశ్వీ గౌతమ్ కు చెప్పాడు. దీని తర్వాత పాండ్యా ఆ బ్యాట్ పై తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.

Hardik Pandya Gifts Unforgettable Bat to Kashvee Gautam Video Goes Viral

డబ్ల్యూపీఎల్ సయయంలో హార్దిక్ ను కలిసిన కాశ్వీ గౌతమ్
డబ్ల్యూపీఎల్ సమయంలో హార్దిక్ పాండ్యా, కాశ్వీ గౌతమ్ కలుసుకున్నారు. డబ్ల్యూపీఎల్ లో మ్యాచ్ ముగిసిన అనంతరం కాశ్వీ గౌతమ్‌.. హార్దిక్ పాండ్యాను కలిసింది. అప్పుడు ఆమెను హర్లీన్ డియోల్.. హార్దిక్‌కు పరిచయం చేసింది. 'హాయ్ సర్.. మీకు నేను పెద్ద అభిమానిని.'అని కాశ్వీ గౌతమ్ అనగా.. 'థ్యాంక్యూ.. ఈ సీజన్ ఎలా సాగింది?'అని హార్దిక్ బదులిచ్చాడు. అందుకు ఆమె చాలా బాగా సాగిందని చెప్పింది. వెంటనే హర్లీన్ డియోల్.. కాశ్వీ మీకు పెద్ద అభిమాని, మిమ్మల్ని తరుచూ ఇమిటేట్ చేస్తోందని తెలిపింది. వెంటనే హార్దిక్.. మీరు కూడా ఆల్ రౌండరా? బ్యాటింగ్ కూడా చేస్తారా? అని అడిగాడు. వెంటనే కాశ్వీ'అవును.. నేను బ్యాటింగ్ కూడా చేస్తాను. నా బ్యాట్‌పై HP33 అని రాసి ఉంది.'అని చెప్పింది. హార్దిక్ బ్యాట్ గురించి ప్రశ్నించి.. మంచి బ్యాట్‌ను బహుమతిగా పంపిస్తానని చెప్పాడు. దాంతో కాశ్వీ గౌతమ్ సంతోషం వ్యక్తం చేసింది. తాజాగా హార్దిక్ పాండ్యా బ్యాట్ ఇచ్చి తన మాటను నిలబెట్టుకున్నాడు.

కాశ్వీ గౌతమ్ ను నెటిజన్లు ఇషాన్ కిషన్ చెల్లెలుగా పిలుస్తారు. చూడటానికి ఇద్దరూ ఒకేలా ఉండడంతో కాశ్వీ గౌతమ్ కు ఇషాన్ కిషన్ సిస్టర్ అనే పేరు పెట్టారు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ చెల్లెలికి హార్దిక్ పాండ్యా గిఫ్ట్ ఇచ్చాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. అసలు విషయమేమిటంటే.. ఇషాన్ కిషన్ కు, కాశ్వీ గౌతమ్ కు ఎలాంటి సంబంధం లేదు. ఇషాన్ కిషన్ జార్ఖండ్ కు చెందిన ఆటగాడు అయితే.. కాశ్వీ గౌతమ్ చంఢీగఢ్ ప్లేయర్ కావడం గమనార్హం.

Story first published: Sunday, April 13, 2025, 17:53 [IST]
Other articles published on Apr 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+