సచిన్ ఆనాడే చెప్పాడు: లీషాతో డేటింగ్, పాండ్యాపై ప్రత్యేకం
న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు ఛీప్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది జట్టు సభ్యులతో కూడిన టీమిండియాను బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రంజీ క్రికెట్ అనుభవం కూడా పెద్దగా లేని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసి ఆశ్చర్యపరిచారు.
హార్దిక్ పాండ్యా ఎంపిక నిర్ణయంపై ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను ప్రశ్నించినప్పుడు 'కపిల్ దేవ్ తర్వాత అంతటి కచ్చితమైన ఆల్ రౌండర్ కోసం ప్రయత్నిస్తున్నామని అందుకే కొత్త వారికి అవకాశమిస్తున్నామని' సమాధానమిచ్చారు.
నిజమే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం సుదీర్ఘ కాలం నిరీక్షించిన టీమిండియాకు దొరికిన ఆణిముత్యం హార్దిక్ పాండ్యా. రంజీ క్రికెట్‌లో బరోడాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. యుక్తవయసులో మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే అకాడమీలో శిక్షణ పొందాడు
తన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాలో సంచలనంగా మారిన హార్దిక్ పాండ్యా జీవితంలో ఎన్నో ఆసక్తికర విశేషాలున్నాయి. క్రికెట్‌పై ఆసక్తితో తొమ్మిదో తరగతిలోనే చదువు మానేశాడు. పాండ్యా ఆసక్తిని గమనించి అతడి తండ్రి హిమాన్షు ఆ దిశగా పాండ్యాను ప్రోత్సహించాడు.

కిరణ్ మోరే ఉచితంగా శిక్షణ
హార్దిక్, అతడి సోదరుడు క్రునాల్ పాండ్యాకు మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ఉచితంగా శిక్షణ నిచ్చాడు. బరోడాలోని తన అకాడమీలో మూడేళ్లపాటు ఎటువంటి ఫీజు తీసుకోలేదు. ఆరంభంలో హార్దిక్ లెగ్ స్పిన్ వేసేవాడు. అయితే, మోరే సలహాతో ఆ తర్వాత పాండ్యా మీడియం పేసర్‌గా మారాడు.

డబ్బు కోసం చిన్న చిన్న టోర్నీలో కూడా
రెండేళ్ల క్రితం వరకు గుజరాత్‌లోని గ్రామాల్లో జరిగే టోర్నీల్లో కేవలం రూ. 400 కోసం వివిధ జట్ల తరఫున పాండ్యా బరిలోకి దిగేవాడు. పేరు కూడా లేని టోర్నీల్లో ఆడేవారమని హార్దిక్ ఒకానొక సందర్భంలో చెప్పాడు. ఆ సమయంలో ఎంతో కొంత డబ్బు వస్తే చాలనుకునే పరిస్థితి తనదని తెలిపాడు.

పాండ్యాకు సరైన బ్యాట్ కూడా లేదు
రంజీ క్రికెట్‌లో ఆడటం ప్రారంభించిన తొలినాళ్లలో హార్దిక్ పాండ్యాకు సరైన బ్యాటు కూడా లేదు. 2014లో జరిగిన విజయ్ హజారే టోర్నీలో ఆడేందుకు బ్యాట్ లేకపోతే టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన బ్యాట్ ఇచ్చి ఆదుకున్నాడు.

ట్రయల్స్ కోసం రమ్మని చెప్పిన జాన్ రైట్
పాండ్యా ప్రతిభను గుర్తించిన ముంబై ఇండియన్స్ కోచ్ జాన్ రైట్ ట్రయల్స్ కోసం రమ్మని సందేశం పంపాడు. ఆ తర్వాత 2015 ఐపీఎల్‌లో ముంబై తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడి నుంచే అతని కెరీర్ వేగం పుంజుకుంది. ఇక, షార్ట్ బాల్స్‌ను ఎలా ఎదుర్కోవాలో నేర్పింది ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ మెంటార్ రికీ పాంటింగ్ అని హార్దిక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తొలి ట్రైనింగ్ సెషన్‌లో ‘నువ్వు దేనిని మెరుగుపరచు కోవాలనుకుంటున్నావ'ని పాంటింగ్ అడిగితే.. షార్ట్ బాల్ ఆడడం అని చెప్పానని పాండ్యా గుర్తు చేసుకున్నాడు.

సచిన్ సైతం ప్రశంసలు
వాంఖడేలో ఓ వామప్ మ్యాచ్ తర్వాత పాండ్యా ప్రదర్శనను దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంతో ప్రశంసించాడు. 2015 ఐపీఎల్ సందర్భంగా ఇలాగే రాణిస్తే.. అతి త్వరలో భారత జట్టులో చోటు సంపాదిస్తాడని అన్నాడు. 2016, జనవరిలో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో హార్దిక్ అరంగేట్రం చేశాడు.

పాండ్యా కెరీర్‌ను మలుపు తిప్పిన వరల్డ్ టీ20
భారతలో జరిగిన వరల్డ్ టీ20లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టును గెలిపించిన పాండ్యా.. టీమిండియా హీరోగా మారాడు. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసిన పాండ్యా.. చివరి మూడు బంతుల్లో రనౌట్ సహా 3 వికెట్లు తీయడంతో అతని పేరు మార్మోగిపోయింది.

మోడల్ లీషా శర్మతో పాండ్యా డేటింగ్
కోల్‌కతాకు చెందిన మోడల్ లీషా శర్మతో పాండ్యా డేటింగ్ చేస్తున్నాడు. ఏడాదిగా వారిద్దరూ పలుసార్లు కనిపించారనే వార్తలూ వచ్చాయి. ఇద్దరూ కలిసి హాంకాంగ్‌లో ఎంజాయ్ కూడా చేశారట. పాండ్యాతో ఉన్న కొన్ని ఫొటోలను లీషా.. నెట్‌లో కూడా పోస్ట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications