ఎందుకలా చేశాడు: కోహ్లీపై ప్రతీకారం తీర్చుకున్న పాండ్యా
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం తన 29వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పలువు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాకు చెందిన ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో కోహ్లీ సైకత శిల్పాన్ని వేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

రాత్రి 12 గంటలకు హోటల్ రూమ్‌లో
ఇదిలా ఉంటే రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టీ20 ముగిసిన తర్వాత రాత్రి 12 గంటలకు హోటల్ రూమ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజుని జట్టులోని ఆటగాళ్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోహ్లీ పుట్టినరోజు వేడుకల్లో జట్టంతా పాల్గొంది. కోహ్లీని కేక్‌లో ముంచెత్తారు.

కోహ్లీని గుర్తు పట్టడానికి కూడా వీల్లేకుండా చేశారు
కెప్టెన్ అని కూడా చూడకుండా దొరికిందే ఛాన్స్ అన్నట్లు కోహ్లీని గుర్తు పట్టడానికి కూడా వీల్లేకుండా చేశారు. నిజానికి కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత జట్టులో ఎవరి పుట్టినరోజు జరిగినా.. ఆ ప్లేయర్‌ను కేక్‌తో ముంచెత్తడం ఆనవాయితీగా మారింది. గతంలో పాండ్యాను కూడా జట్టులోని ఆటగాళ్లు కేక్‌తో ముంచెత్తారు.

ప్రతీకారం తీసుకునే ఛాన్స్ దక్కింది
దీంతో ఇప్పుడు కోహ్లీపై తనకు ప్రతీకారం తీసుకునే ఛాన్స్ దక్కిందని ఈ సందర్భంగా పాండ్యా ట్వీట్ చేశాడు. కాగా మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం తిరువనంతపురం వేదికగా మూడో టీ20 జరగనుంది. ఈ సిరిస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.
పాండ్యా పుట్టినరోజు నాడు ఇలా
ఆల్ రౌండర్ పాండ్యా పుట్టినరోజు సందర్భంగా జట్టంతా హోటల్ రూమ్‌లో అతడి పుట్టినరోజుని సెలబ్రేట్ చేశాయి. అందుకు సంబంధించన వీడియో మీ కోసం...
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications