Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీడియో: లా జ‌వాబ్! హార్ధిక్ పాండ్య బ్రిలియంట్ బౌన్స‌ర్‌..సోష‌ల్ మీడియా స‌లాం!

ICC Cricket World Cup 2019 : Hardik Pandya Fails Sarfaraz’s Attempt To Charge With A Bouncer
Hardik Pandya fails Sarfaraz Ahmed’s attempt to charge with a bouncer; laughs him off

మాంఛెస్ట‌ర్‌: ఇంగ్లండ్‌లోని మాంఛెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదిక‌గా ఆదివారం ముగిసిన వ‌న్డే మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఆల్ రౌండ‌ర్ హార్ధిక్ పాండ్య సంధించిన ఓ బౌన్స‌ర్‌.. అద్భుతం. ఈ బంతిని ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం అంచనా వేయ‌లేక‌పోయాడు. బెంబేలెత్తిపోయాడు. ఈ బౌన్స‌ర్‌ను ఆడ‌టానికి ఇబ్బంది ప‌డ్డాడు. అయిన‌ప్ప‌టికీ.. వికెట్ ప‌డకుండా అడ్డుకోగ‌లిగాడు.

టీమిండియా ఇన్నింగ్‌లో 27వ ఓవ‌ర్ అది. ఆ ఓవ‌ర్‌లో హార్ధిక్ పాండ్య వ‌రుస‌గా రెండు బంతుల్లో రెండు వికెట్ల‌ను బ‌లిగొన్నాడు. మ‌హ‌మ్మ‌ద్ హ‌ఫీజ్‌, షోయ‌బ్ మాలిక్ వ‌రుస బంతుల్లో అవుట్ అయిన త‌రువాత క్రీజ్‌లోకి వచ్చాడు పాకిస్తాన్ జ‌ట్టు కేప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌. హార్ధిక్ పాండ్య హ్యాట్రిక్ బంతిని ఎదుర్కొన‌డానికి సిద్ధ‌ప‌డ్డాడు. హార్ధిక్ పాండ్యా చేతి నుంచి బంతి వెలువ‌డే స‌మ‌యానికి క్రీజ్‌ను వదిలి ముందుకొచ్చాడు. హ్యాట్రిక్ బంతిని ఆడ‌టానికి ఫ్రంట్ ఫుట్ తీసుకున్నాడు స‌ర్ఫ‌రాజ్‌. బంతిని యార్క‌ర్‌గా వేస్తాడని, దీన్ని ఫుల్‌టాస్‌గా ఆడాల‌నే ఉద్దేశంతో స‌ర్ఫ‌రాజ్ ఫ్రంట్ ఫుట్ తీసుకున్నాడు. అలాగే కౌంట‌ర్ ఎటాక్ చేస్తూ పాండ్య లైన్ అండ్ లెంగ్త్‌ను డిస్ట‌ర్బ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

దీన్ని ముందే ప‌సిగ‌ట్టాడు హార్ధిక్ పాండ్య‌. అప్పటిక‌ప్పుడు త‌న వ్యూహాన్ని మార్చుకున్నాడు. యార్కర్‌కు బ‌దులుగా బౌన్స‌ర్ సంధించాడు. హాఫ్ పిచ్‌లో ప‌డ్డ ఆ బంతి గింగిరాలు తిరుగుతూ, స‌ర్ఫ‌రాజ్‌పైకి దూసుకెళ్లింది. అప్ప‌టికే ఫ్రంట్ ఫుట్ రావ‌డం, బంతి అనూహ్యంగా బౌన్స్ కావ‌డంతో త‌డ‌బ‌డ్డాడు స‌ర్ఫ‌రాజ్‌. ఫ్రంట్ ఫుట్‌లోకి వ‌చ్చిన త‌రువాత బౌన్స‌ర్‌ను ఆడ‌టం ఎంత క్లిష్ట‌త‌ర‌మో క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌కే బాగా తెలుసు. అయిన‌ప్ప‌టికీ.. త‌న తల మీదుగా వ‌చ్చిన బంతికి బ్యాట్‌ను అడ్డు పెట్టాడు. దాదాపు స‌ర్ఫ‌రాజ్ గ్లౌస్‌ను తాకుతూ ఆ బంతి స్లిప్‌లో గాల్లోకి ఎగిరింది. స్లిప్‌లో ఫీల్డ‌ర్ లేక‌పోవ‌డం నిజంగా స‌ర్ఫ‌రాజ్ అదృష్ట‌మే. ఈ బౌన్స‌ర్ ప‌ట్ల సోష‌ల్ మీడియా స‌లాం కొడుతోంది. లా జ‌వాబ్ అంటూ ప్ర‌శంసిస్తోంది.

Story first published: Monday, June 17, 2019, 14:10 [IST]
Other articles published on Jun 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+