For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆటలో ఫామ్ లేదు కానీ.. గర్ల్‌ఫ్రెండ్‌తో షికార్లా? (వీడియో)

Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఆశించిన రీతిలో సాగడం లేదు. గ్రూప్ దశలో కష్టపడి నెట్టుకొచ్చిన భారత్.. నాకౌట్(సూపర్-8) దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీమ్ ఆటతీరు పేలవంగా ఉండటంతో ఇప్పుడు ప్రతి చిన్న విషయం భూతద్దంలో కనిపిస్తోంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలవుతున్నాడు.

బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన?
సాధారణంగా ఐసీసీ టోర్నీల సమయంలో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండటానిక బీసీసీఐ (BCCI) కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. టోర్నీ జరుగుతున్నంత కాలం ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను లేదా సన్నిహితులను వెంట తీసుకెళ్లకూడదనే నిబంధన ఉంది. వృత్తిపరమైన నిబద్ధతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుత ప్రపంచ కప్ సమయంలో హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మతో కలిసి కనిపిస్తుండటం వివాదాస్పదంగా మారింది. ముంబై, కొలంబో, అహ్మదాబాద్‌లలోనే కాకుండా తాజాగా జింబాబ్వే మ్యాచ్ కోసం చెన్నై చేరుకున్నప్పుడు కూడా ఆమె అతని వెంటే ఉంది.

Hardik Pandya Faces Social Media Backlash Over Girlfriend Presence Amid Poor Form in T20 World Cup 2026

సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్
హార్దిక్ తీరుపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "హార్దిక్ పాండ్యా ఎందుకు సాధారణంగా ఉండలేడు? ఈ ప్రపంచంలో గర్ల్‌ఫ్రెండ్ ఉన్న ఏకైక వ్యక్తి అతనే అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. ఆమె భుజంపై చేయి వేసి టీమ్‌తో పాటు ఉంచుతూ షోఆఫ్ చేస్తున్నాడు." అని ఓ నెటిజన్ విమర్శించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. "BCCI నిబంధనల ప్రకారం టోర్నీ సమయంలో కుటుంబ సభ్యులకు అనుమతి లేదు. కానీ హార్దిక్ మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్‌ను అన్ని నగరాలకు వెంట తీసుకెళ్తున్నాడు. ఆటగాడిని బట్టి రూల్స్ మారుతాయా?" అని ప్రశ్నించాడు.

ఆట కంటే వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యమా?
టీమిండియా విజయాలు సాధిస్తూ.. హార్దిక్ మంచి ఫామ్‌లో ఉండి ఉంటే బహుశా ఈ విమర్శలు వచ్చేవి కావని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ అటు జట్టు ఓడిపోతుండటం.. ఇటు హార్దిక్ స్వయంగా ఫామ్ కోసం ఇబ్బంది పడుతుండటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటపై దృష్టి పెట్టకుండా విలాసాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడనేది నెటిజన్లు ప్రధానంగా ఆరోపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Story first published: Tuesday, February 24, 2026, 12:34 [IST]
Other articles published on Feb 24, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+