Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యా ఛాప్టర్ ముగిసినట్టేనా?..అతనికి వెంకటేష్ అయ్యర్ ఎసరు పెట్టాడా?

Hardik Pandya doubtful for the South Africa tour, after dropped from the home series against NZ

ముంబై: భారత క్రికెట్ జట్టులో నిఖార్సయిన ఆల్‌రౌండర్ స్టేటస్‌లో కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా కేరీర్ అప్పుడే చరమాంకంలో పడింది. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాలకు బ్యాక్ బోన్‌గా ఉంటూ వచ్చిన పాండ్యా.. జట్టులో చోటు సంపాదించడానికి తంటాలు పడాల్సి వస్తోంది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టులో అతనికి స్థానం లభించలేదు. అటు అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కూడా రిటైన్ చేసుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అతని కేరీర్‌పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

బౌలింగ్ దూరం కావడంతో..

బౌలింగ్ దూరం కావడంతో..

కొంతకాలంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ చేయట్లేదు. భుజానికి సర్జరీ చేయించుకున్నప్పటి నుంచీ అతను బంతిని అందుకోవట్లేదు. అటు బ్యాటింగ్‌లోనూ అంచనాలకు అందని విధంగా దిగజారుతున్నాడు. ఇదివరకట్లా మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14లో అతను తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేదనేది ప్రతి అభిమాని కూడా అంగీకరించి తీరుతాడు. ఒక్క ఓవర్‌ను కూడా సంధించలేకపోయాడు. అలాగనీ- బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయాడతను. క్రమంగా ఆల్‌రౌండర్ అనే హోదాను కోల్పోతూ వస్తోన్నాడు.

ఐపీఎల్‌లో నాసిరకం..

ఐపీఎల్‌లో నాసిరకం..

ఐపీఎల్‌లో నాసిరకం ఆటతీరును ప్రదర్శించాడు హార్దిక్. ముంబై ఇండియన్స్ తరఫున మొత్తం 12 మ్యాచ్‌లను ఆడిన అతను 127 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 14.11 శాతం మాత్రమే. అత్యధిక స్కోర్ 40. 12 మ్యాచ్‌లకు కలిపి 127 పరుగులు చేస్తే.. అందులో 40 రన్స్ ఒక్క మ్యాచ్‌లో వచ్చినవే. మిగిలిన 11 మ్యాచ్‌లల్లో అతను ఏ స్థాయిలో ఆడాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బౌలింగ్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. ఒక్క ఓవర్‌ను కూడా విసరలేకపోయాడు. దీనికి కారణం- సర్జరీ.

అదే అతనికి శాపంగా మారిందా..

అదే అతనికి శాపంగా మారిందా..

ఇప్పుడు అదే అతనికి శాపంగా మారినట్టు కనిపిస్తోంది. జాతీయ జట్టులో చోటు దక్కనివ్వకుండా చేసేలా ఉంది. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన జట్టులో హార్దిక్‌కు చోటు దక్కలేదు. త్వరలో టీమిండియా చేపట్టబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా అతను ఎంపిక అవుతాడా? లేదా? అనేది అనుమానమే. అతనికి ఫిట్‌నెస్ సహకరించట్లేదు. హార్దిక్ ఎంత విశ్రాంతి తీసుకుంటే.. అంత త్వరగా కోలుకుంటాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులు తేల్చి చెబుతున్నారు.

ఎన్సీఏకు రిపోర్ట్..

ఎన్సీఏకు రిపోర్ట్..

ఈ పరిణామాల మధ్య హార్దిక్ పాండ్యాను నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాల్సిందిగా బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ మీద సమగ్రమైన నివేదికను అందిన తరువాతే అతని పేరును కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలంటే- ఎన్సీఏ నిర్వహించే టెస్టుల్లో అతను పాల్గొనాల్సి ఉంటుంది. టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన వచ్చే జనవరి 11వ తేదీన మొదలవుతుంది. వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్‌ను ఆడుతుంది. ఇంకా సమయం ఉన్నందున.. హార్దిక్‌కు తన ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి అవకాశం లభించినట్టే.

 యంగ్‌స్టర్స్..

యంగ్‌స్టర్స్..

హార్దిక్ పాండ్యా పరిస్థితి ఇలా ఉంటే.. మరోవంక టీ20 ఫార్మట్‌లోకి కొత్త రక్తం దూసుకొస్తోంది. ప్రత్యేకించి- వెంకటేష్ అయ్యర్. హార్దిక్ పాండ్యాను తలదన్నేలా అద్భుతంగా ఆడుతున్నాడతను. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటాడు. కోల్‌కత మ్యాచ్‌లో మూడు ఓవర్లల్లో 12 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఒక వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడగా రాణిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయడానికి వెంకటేష్ అయ్యర్ రూపంలో ఓ ప్రత్యామ్నాయం లభించినట్టేనని భావిస్తున్నారు.

Story first published: Monday, November 22, 2021, 12:18 [IST]
Other articles published on Nov 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+