For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత జట్టులో కీలక సభ్యుడు: పాండ్యా ప్రదర్శనపై భజ్జీ ప్రశంసలు

Hardik Pandya doing well is good for Team India: Harbhajan Singh

హైదరాబాద్: ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హార్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. గత ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో విజయం సాధించడంలో హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాండ్యా 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సుర్లు ఉన్నాయి. అయితే, న్యూజిలాండ్ స్పిన్నర్ ఆస్లే వేసిన ఓవర్‌లో పాండ్యా వరుసగా మూడు సిక్సర్లు బాదడం విశేషం. ఇలా ఓ వన్డే మ్యాచ్‌లో పాండ్యా వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం ఐదో సారి.

హర్భజన్ సింగ్

హర్భజన్ సింగ్

పాండ్యా ప్రదర్శనపై హర్భజన్ సింగ్ మాట్లాడుతూ "పాండ్యా బ్యాటు, బంతితో అద్భుతంగా రాణించాడు. అతడి ఫామ్‌ చూసి చాలా సంతోషిస్తున్నా. తనపైనున్న వివాదాన్ని పక్కకు నెట్టేశాడు. అతడి క్రికెట్‌ గురించి మరెవరూ మాట్లాడకుండా చేశాడు. పాండ్యా ప్రదర్శన నిజంగా అద్భుతం. టీమిండియాలో అత్యంత కీలక సభ్యుడు" అని అన్నాడు.

18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో

18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో

ఐదో వన్డేలో వీస్‌ పేసర్లు హెన్రీ, బౌల్ట్‌లు విజృంభించడంతో టీమిండియా 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దశలో జట్టుని ఆదుకున్న రాయుడు, శంకర్ జోడీ.. మెరుగైన స్కోరు అందించారు. ఈ క్రమంలో అంబటి రాయుడు హాఫ్‌ సెంచరీ సాధించాడు. 86 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో కెరీర్‌లో 10వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఐదో వికెట్‌కు అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం

18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను రాయుడు.. క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌తో కలిసి ఆదుకున్నాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీకి చేరువైన విజయ్‌ శంకర్‌ జట్టు స్కోరు 116 వద్ద రాయుడితో సమన్వయలోపం కారణంగా శంకర్ రనౌటయ్యాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగిన పాండ్యా

విజయ్ శంకర్ రనౌటైన తర్వాత దూకుడుగా ఆడిన రాయుడు.. సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. జట్టు స్కోరు 190 వద్ద సిక్స్ కొట్టే ప్రయత్నంలో హెన్రీ బౌలింగ్‌లో ఫీల్డర్ మున్రోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ 47వ ఓవర్ వేసిన ఆస్లే బౌలింగ్‌లో 6, 6, 6 బాదిన హార్దిక్.. ఆ తర్వాత ఓవర్‌లోనూ బౌల్ట్‌ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్ బాదాడు.

పాండ్యా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన భజ్జీ

ఇక ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన నీషమ్ బౌలింగ్‌లోనూ 4, 6 బాదేశాడు. అయితే, జట్టు స్కోరు 248 వద్ద పాండ్యా ఔటవగా.. ఆఖరి ఓవర్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి మహ్మద్ షమీ రనౌటయ్యాడు. కాఫీ విత్‌ కరణ్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యాపై హర్భజన్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, February 5, 2019, 12:41 [IST]
Other articles published on Feb 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+