Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్‌ను మెచ్చుకున్న మాజీ లెజెండ్

Hardik Pandya did good use of his bowlers says Wasim Jaffer

న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా చివరి బంతికి గెలిచింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ను కివీస్ బౌలర్లు తెగ ఇబ్బంది పెట్టారు. అయినా చివర్లో సూర్యకుమార్ యాదవ్ (26 నాటౌట్), హార్దిక్ పాండ్యా (15 నాటౌట్) ఇద్దరూ కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో భారత సారధి హార్దిక్ పాండ్యా తన బౌలర్లను అద్భుతంగా ఉపయోగించుకున్నాడని మాజీ లెజెండ్ వసీం జాఫర్ కొనియాడాడు.

పాండ్యా తెలివి..

పాండ్యా తెలివి..

అయితే లక్నో పిచ్‌పై మాత్రం చాలా దారుణంగా ఉందని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం ఇలాంటి పిచ్ చేస్తారని తను కలలో కూడా ఊహించలేదని చెప్పాడు. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో పాండ్యా స్ట్రాటజీ చాలా బాగుందని మెచ్చుకున్నాడు. 'ఈసారి పాండ్యా స్పాటాన్‌గా మార్పులు చేశాడు. స్పిన్నర్లను ఎక్కువగా ఉపయోగించుకున్నాడు. అర్షదీప్ సింగ్‌ను పెద్దగా వాడుకోలేదు' అని తెలిపాడు. అదే సమయంలో లక్నో పిచ్‌పై మాత్రం పెదవి విరిచాడు.

టీ20కి సరిపోయే పిచ్ కాదు..

టీ20కి సరిపోయే పిచ్ కాదు..

'ఈ వికెట్ టీ20 ఆటకు సరైంది కాదు. అయితే ప్రేక్షకులకు ఒక థ్రిల్లర్ మ్యాచ్ చూసే అవకాశం దొరికింది కాబట్టి ఓకే. ఊహించకపోయినా.. కనీసం ఇండియా గెలవడం చూసి సంతోషించి ఉంటారు' అని చెప్పాడు. సాధారణంగా దేశవాళీలు జరిగే సమయంలో లక్నోలో ఇలాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లు తయారు చేస్తారని చెప్పాడు. 'లక్నోలో రంజీ మ్యాచ్ ఆడే సమయంలో ఇలా స్పిన్‌కు సహకరించే పిచ్‌ తయారు చేస్తారు. అంతర్జాతీయ మ్యాచ్‌కు కూడా అలాంటి పిచ్ ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయా' అని చెప్పాడు.

 భారత బ్యాటర్ల తెలివి..

భారత బ్యాటర్ల తెలివి..

అదే సమయంలో భారత ఆటగాళ్లు స్పిన్‌ను ఆడటంలో మరింత తెలివిగా కనిపించారన్నాడు. తొలి మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారన్న జాఫర్.. రెండో మ్యాచ్‌లో కూడా వాళ్లు చాలా తెలివిగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. అయితే భారత బ్యాటర్లు ఈసారి మరింత తెలివిగా స్పిన్నర్లను ఎదుర్కొన్నారని మెచ్చుకున్నాడు. 'భారత్, న్యూజిల్యాండ్ రెండు జట్ల స్పిన్నర్లు చక్కగా బౌలింగ్ చేశారు. కానీ వాళ్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తెలివి చూపించారు. వాళ్లను చక్కగా హ్యాండిల్ చేశారు' అన్నాడు.

 మరో 20 పరుగులు చేసుంటే..

మరో 20 పరుగులు చేసుంటే..

అలాగే న్యూజిల్యాండ్ కనుక మరో 20-30 పరుగులు చేసి ఉంటే భారత్ విజయం చాలా కష్టమయ్యేదని అభిప్రాయపడ్డాడు. వాళ్లు బౌలింగ్ కూడా చాలా బాగా చేశారన్నాడు. 'వాళ్లు కనుక 130 వరకు స్కోరు చేసి ఉంటే ఛేజింగ్ చాలా కష్టమయ్యేది. ఆ జట్టు 20-30 పరుగులు తక్కువ చేసింది. వాళ్లు కనుక కనీసం 120 స్కోరు చేసినా భారత్ గెలుపు అంత ఈజీ అయ్యేది కాదు. ఎందుకంటే కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రాంచీలో కూడా కివీస్ బాగానే బౌలింగ్ చేసింది' అని విశ్లేషించాడు.

Story first published: Monday, January 30, 2023, 12:13 [IST]
Other articles published on Jan 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+