Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్‌ మలుపు తిరిగింది అక్కడే: పాండ్యా, ధోనిలపై కోహ్లీ

హైదరాబాద్: ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

తొలి వన్డేలో టీమిండియా 26 పరుగుల తేడాతో(డక్ వర్త్ లూయిస్ ప్రకారం) ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

100వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన ధోని

100వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన ధోని

ఈ క్రమంలోనే పాండ్యా తొలుత హాఫ్ సెంచరీని నమోదు చేయగా, ఆ తర్వాత ధోని తన కెరీర్‌లో 100వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ వీరి ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. 'మేమే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడానికి కారణం స్కోరు బోర్డుపై భారీ స్కోరు ఉంచడం కోసమే. దురదృష్టవశాత్తూ మ్యాచ్‌ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయాం' అని కోహ్లీ అన్నాడు.

మ్యాచ్‌ని నిలబెట్టిన ధోని

మ్యాచ్‌ని నిలబెట్టిన ధోని

'మేము అనుకున్నట్లుగానే ధోని మ్యాచ్‌ను నిలబెట్టాడు. ఆ సమయంలో ధోని నుంచి చక్కటి సహకారం లభించింది. ధోని, కేదార్‌ జాదవ్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. జాదవ్‌తో కలిసి ముందు మ్యాచ్ పై పట్టుసాధించే యత్నం చేశాడు. ప్రధానంగా హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడటం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది' అని కోహ్లీ పేర్కొన్నాడు.

పాండ్యా ఒక కచ్చితమైన ఆల్ రౌండర్

పాండ్యా ఒక కచ్చితమైన ఆల్ రౌండర్

'ఒకవైపు ధోని నిలకడను కొనసాగిస్తే, హార్దిక్ ఎదురుదాడికి దిగి సక్సెస్ అయ్యాడు. హార్దిక్ ఒక కచ్చితమైన ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. మా జట్టులో హార్దిక్ ఉండటం నిజంగా అదృష్టం. తొలి వన్డేలో విజయం సాధించడానికి మిడిల్ ఆర్డర్ తో పాటు లోయర్ ఆర్డరే కారణం. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌లో మన జట్టు ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ' అని కోహ్లీ తెలిపాడు.

అతని ఇన్నింగ్స్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది

అతని ఇన్నింగ్స్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది

'హార్దిక్‌ తనను తాను నమ్ముతాడు. ఈ మ్యాచ్‌లో అతని ఇన్నింగ్స్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. అతనో గేమ్‌ ఛేంజర్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లో పాండ్యా రాణించాడు. ధోని అనుభవం మరొకసారి మాకు ఉపయోగపడింది. బౌలర్లు చాహల్‌, భువి, బుమ్రా అద్భుత ప్రదర్శన చేశారు. తక్కువ స్కోరుకే వారిని కట్టడి చేయగలిగారు' అని కోహ్లీ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+