Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ ముంబై విందుకు హార్ధిక్ పాండ్యా ఎందుకు రాలేదో తెలుసా?

Hardik Pandya dances to popular Punjabi song at Krunal's pre-wedding bash

హైదరాబాద్: విరుష్క జోడీ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండో రిసెప్షన్‌లో తోటి క్రీడాకారులందరూ వచ్చారు. కానీ హార్ధిక్ పాండ్యా మాత్రం రాలేదు. రాకపోగా తను వేరే పార్టీలో చిందులు వేస్తూ గడిపాడు. విరాట్ కోహ్లీ, అనుష్కల రిసెప్షన్ కంటే పెద్ద వేడుకా అంటే అవుననే అనాలి. ఎందుకంటే అది హార్ధిక్ పాండ్యా అన్నయ్య మెహందీ ఫంక్షనే కాబట్టి.

డిసెంబర్ 27(బుధవారం) హార్దిక్‌ పాండ్య అన్నయ్య కునాల్‌ పాండ్య వివాహం. మంగళవారం అన్న పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్న పాండ్యా ముంబైలో విరుష్క జోడీ ఇచ్చిన వివాహ విందుకు హాజరుకాలేదు.

సరిగ్గా అదే రోజు కునాల్‌ కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన మెహందీ ఫంక్షన్‌లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో హార్దిక్‌-కునాల్‌ చిందులు వేస్తూ సందడిగా గడిపాడు. ఆ వీడియోను తన అధికారిక న్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ అకౌంట్లలో ఉంచాడు. చూసిన అభిమానులంతా ఇప్పుడు పాండ్య బ్రదర్స్‌ చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను బాగుందంటూ అభినందిస్తున్నారు.

కునాల్‌ తన ప్రియురాలైన పంకురి శర్మను వివాహమాడనున్నాడు. పెళ్లికి ముందు నిర్వహించిన ఫొటో షూట్‌కు సంబంధించిన చిత్రాలను కునాల్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. గతంలో కునాలే తన ప్రియురాలితో పెళ్లి నిశ్చయమైనట్లు తెలిపాడు. ముంబైలోని జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది.

పాండ్య సోదరులిద్దరూ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ వివాహం అనంతరం హార్దిక్‌ కోహ్లీ సేనతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 18:13 [IST]
Other articles published on Dec 27, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+