ప్రస్తుతం దేశంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఫోబియా పట్టుకుంది. అందరూ ఆ సినిమాలోని డైలాగులు చెబుతూ, డ్యాన్స్‌లు చేస్తూ ఇమిటేట్ చేస్తున్నారు. తగ్గెదేలా అంటూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప చిత్రంలోని శ్రీవల్లి సాంగ్‌కు అల్లు అర్జున్ మాదిరిగా చెప్పులతో డ్యాన్స్ చేస్తూ అదరగొడుతున్నారు. ఈ పుష్ప మానియా ఇప్పటికే దేశం దాటి ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. ఇక క్రికెటర్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క ఇండియా ఆటగాళ్లే కాకుండా విదేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా పుష్ప పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ, డైలాగులు చెబుతూ అదరగొడుతున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ మానియా ముసలివాళ్లను కూడా తాకింది. ఓ ముసలావిడ పుష్ప చిత్రంలోని శ్రీవల్లి సాంగ్‌కు కాలు కదపడం ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అది కూడా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాతో కలిసి శ్రీవల్లి పాటకు స్టెప్పులేయడం ఆకట్టుకుంటుంది. అయితే ఆ ముసలావిడ ఎవరో కాదు స్వయాన హార్ధిక్ పాండ్యా నానమ్మనే కావడం గమనార్హం. వయసు సహకరించకపోయినా మనువడితో కలిసి శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి హార్ధిక్ పాండ్యా నానమ్మ అదరగొట్టింది. అల్లు అర్జున్ మాదిరిగా పాండ్యాతో కలిసి కాలు కదలించింది. చివరగా తగ్గెదేలే అనే మేనరిజంతో ముగించింది. ఈ వీడియోకు "అవర్ వెరీ ఓన్ పుష్ప నాని " అని క్యాప్షన్ పెట్టి హార్ధిక్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు వీరి డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బామ్మ డ్యాన్స్ అదిరింది అంటూ కొనియాడుతున్నారు.
కాగా గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి ఫిట్నెస్ కూడా సాధించినట్టు సమాచారం. దీంతో ఫిబ్రవరి 6 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌కు పాండ్యా అందుబాటులో ఉండనున్నాడు. చాలా కాలంగా గాయంతో బాధపడుతున్న హార్ధిక్ పాండ్యా గత ఐపీఎల్‌తోపాటు టీ20 వరల్డ్‌కప్‌లోనూ అంతగా బౌలింగ్ చేయలేదు. దీంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరంగా ఉండి మరి ఫిట్‌నెస్‌పై హార్ధిక్ పాండ్యా దృష్టి సారించాడు. ఫలితంగా ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించి కరేబియన్లతో సిరీస్‌కు సిద్ధంగా ఉన్నాడు.