'ఆ క్రెడిట్ మొత్తం ద్రవిడ్ సార్‌కే దక్కుతుంది'
హైదరాబాద్: తన క్రికెట్ కెరీర్ అభ్యున్నతిలో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పాత్ర వెలకట్టలేనిదని టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. ఇండియ్ ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించినప్పుడు రాహుల్ సార్ నుంచి అనేక విషయాల్ని నేర్చుకున్నట్లు పాండ్యా తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి సెలక్టర్లు ఎంపిక చేసిన టీమిండియాలో హార్దిక్ పాండ్యా ఒకడు. ఐపీఎల్ పదో సీజన్‌లో ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించడంలో కూడా కీలకపాత్ర పోషించాడు. తాజాగా శుక్రవారం తన క్రికెట్ కెరీర్ అభ్యున్నతిలో ద్రవిడ్ సార్ పాత్ర వెలకట్టలేనిదిగా పాండ్యా తెలిపాడు.

చాలా ఉద్వేగానికి లోనయ్యా
'జాతీయ జట్టులోకి పిలుపు వచ్చినప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనయ్యా. భారత జట్టుకు ఏదో చేయాలనే ఉద్దేశంతో దేవుడే నన్ను అక్కడికి పంపించాడని భావించా. నేను అనుకున్న దానికంటే ముందుగా భారత్ జట్టులో స్థానం సంపాదించడానికి ద్రవిడే సార్ కారణం. ఇక్కడ ఆయనకు థాంక్య్ చెప్పాలి' అని అన్నాడు.

ఆ క్రెడిట్ ద్రవిడ్ సార్‌కే దక్కుతుంది
'ఆయన నన్ను మానసికంగా బలోపేతం చేసి జట్టులో స్థానం సంపాదించడానికి కారణమయ్యాడు. జాతీయ జట్టులో చోటు దక్కే క్రమంలో క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. గతంలో ఆస్ట్రేలియా ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతో కోల్పోయాం. మేము 19 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన తరుణంలో గెలుపు అంచుల వరకూ వచ్చి ఓడాం' అని అన్నాడు.

ఆ మ్యాచ్‌ను గెలుస్తామనే నేను అనుకున్నా
'నిజానికి ఆ మ్యాచ్‌ను గెలుస్తామనే నేను అనుకున్నా. నేను అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్గా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మళ్లింది. అప్పుడు ద్రవిడ్ సార్ నన్ను తిడతారేమోనని భయమేసింది. కానీ ద్రవిడ్ సార్ నాపై ఎటువంటి ఆగ్రహం వ్యక్తం చేయకపోగా, నన్ను పక్కనే కూర్చుపెట్టుకున్నారు' అని చెప్పాడు.

ఆ టాలెంట్ నాలో ఉందని ప్రోత్సహించారు
'ఈ సమయంలో ద్రవిడ్ నాకు కొన్ని మార్గదర్శకాలు సూచించారు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే టాలెంట్ నీలో ఉంది. నువ్వు ఇకపై మ్యాచ్‌లు ఫినిషింగ్ చేసే అలవాటు చేసుకో. అలా చేసిన పక్షంలో టీమిండియాలో నీకు చోటు దక్కడం ఖాయం. ఇలా నాలో స్ఫూర్తిని నింపి టీమిండియాలో చోటు దక్కడానికి ద్రవిడ్ సార్ కారణమయ్యారు' అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications