Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

23 ఏళ్ల నిరీక్షణ‌కి తెరపడింది: అతడే హార్ధిక్ పాండ్యా

హైదరాబాద్: 'హార్ధిక్ పాండ్యా రూపంలో 23 ఏళ్ల భారత్ నిరీక్షణకు తెరపడింది' ఈ మాట అన్నది ఎవరో కాదు ఆస్ట్రేలియా గ్రేట్ ఇయాన్ చాపెల్. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రిటైర్మెంట్ తర్వాత ఆ తరహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రూపంలో టీమిండియాకి దొరికాడని 'క్రిక్ ఇన్ఫో'కి ఇచ్చిన ఇంటర్యూలో చాపెల్ అభిప్రాయపడ్డాడు.

ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ 4-1తో విజయం సాధంచడంలో హార్ధిక్ పాండ్యా పోషించాడని ఛాపెల్ గుర్తు చేశాడు. పేస్‌ బౌలింగ్ ఆల్‌రౌండర్ దొరికినందుకు టీమిండియా‌కి అదనపు బలం చేకూరినట్లైందని చాపెల్ వివరించాడు.

Hardik Pandya could end India's search for next Kapil Dev, says Aussie great Ian Chappell

'కపిల్‌దేవ్‌ స్థానం భర్తీచేసే సత్తా పాండ్యాకు ఉంది. కపిల్‌ దేవ్ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు టీమిండియా పేస్‌ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ కోసం నిరీక్షించింది. తన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో ఈ సుదీర్ఘ నిరీక్షణకి హార్దిక్ పాండ్యా తెరదించాడు. ఆసీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో తన ఆల్‌రౌండర్ ప్రతిభతో కంగారూలపై భారత్ ఆధిపత్యం చెలాయించేలా చేశాడు' అని చాపెల్ అన్నాడు.

'మూడు ఫార్మాట్లలో జట్టుకి అదనపు బలంగా మారాడు. టాప్‌-6లో బ్యాటింగ్‌, 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే అతడు జట్టులో ఉంటే తుది జట్టు ఎంపిక చాలా సులువవుతుంది. పరిస్థితులతో సంబంధం లేకుండా ఐదుగురు బౌలర్లతో సమతూకంతో దాడిచేయగల అవకాశం భారత్‌కు దొరుకుతుంది' అని తెలిపాడు.

'మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా హిట్టింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయడం హార్దిక్ పాండ్యా లాంటి ఆల్‌రౌండర్స్‌కి సాధ్యం. పాండ్యా ఇతర ఆటగాళ్లలో కూడా స్ఫూర్తి నింపగలడు టీమిండియా నిజంగా అత్యంత గొప్ప జట్టు కావాలంటే గట్టి ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై కఠిన పరిస్థితుల్లో గెలవాలి' అని చాపెల్ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+