సెల్ఫీలు దిగడానికా.. మ్యాచ్‌లు ఆడటానికా: పాండ్యాపై నెటిజన్ల చురకలు

హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సఫారీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆరు వన్డేల సిరిస్‌లో తొలి మూడు వన్డేలు ముగిశాయి. ఈ మూడు వన్డేల్లో కోహ్లీసేన విజయం సాధించడంతో సిరిస్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు వన్డేల్లో ఫామ్‌లోలేని ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలు మాత్రమే.
సుదీర్ఘమైన ఈ సఫారీ పర్యటనలో హార్దిక్ పాండ్యా రాణించపోయినప్పటికీ, మ్యాచ్‌కి ముందు మ్యాచ్ తర్వాత సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో తెగ పోస్టు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సహచర ఆటగాళ్లతో సెల్ఫీలు దిగడం మాని ఆటపై దృష్టి పెట్టాలని హార్దిక్ పాండ్యాకు నెటిజన్లు శుక్రవారం చురకలంటిస్తున్నారు.
జోహెన్స్‌బర్గ్ వేదికగా శనివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో వన్డే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నాలుగో వన్డే కోసం జొహానెస్‌బర్గ్ వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్టులో దిగిన ఫొటోను పంచుకున్న పాండ్యా 'కేప్‌టౌన్‌లో విజయం సాధించాం. మరోసారి జొహానెస్‌బర్గ్‌కు' అని పేర్కొన్నాడు.
ఈ ఫొటోలో పాండ్యాతో పాటు ధోనీ, బుమ్రా తదితరులు ఉన్నారు. ఈ ఫోటోని పాండ్యా ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోను చూసిన అభిమానులు పాండ్యాకు చురకలు అంటిస్తున్నారు. 'సెల్ఫీలు మాని.. ఆటపై దృష్టిపెట్టు; పరుగులు సాధించు.. వికెట్లు తీయి' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
మరో నెటిజన్ 'నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావు.. సెల్ఫీలు దిగడానికా.. మ్యాచ్‌లు ఆడటానికా' అంటూ చురకలు అంటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications