హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తాజాగా ఓ యువతితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఫొటోని చూసిన వారంతా పాండ్యా ప్రేమలో పడ్డాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
'పాండ్యా త్వరగా ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పెయ్' అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పాండ్యాను అడిగారు. దీనికి పాండ్యా ట్విటర్ ద్వారా స్పందించాడు. 'మిస్టరీ వీడింది. ఆమె నా సోదరి' అని అభిమానుల ఏదైతే ఊహించుకుంటున్నారో దానికి ఫుల్‌స్టాప్ పెట్టేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో పాండ్యా తన అద్భుత ప్రదర్శనతో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అందుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆసీస్‌తో అక్టోబర్ 7 నుంచి జరిగే టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య తొలి టీ20 రాంచీ వేదికగా అక్టోబర్ 7న జరగనుంది.