ఆరు నిమిషాల్లో 1 మిలియన్ - కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన హార్దిక్
హార్దిక్ పాండ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మైదానంలో మ్యాచ్ ఆడేటప్పుడు తన వింత హావాభావాలతో రకరకాల పోజులిస్తుంటాడు హార్దిక్. అలానే రీసెంట్ గా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజయం సాధించిన తర్వాత తనకు అలవాటైన హావాభావలను ప్రదర్శిస్తూ ఫొటోకు పోజు ఇచ్చాడు హార్దిక్. ఛాంపియన్స్ ట్రోఫీతో కలిసి దుబాయ్ పిచ్‌పై ఫొటో దిగాడు. ఇప్పుడా ఫొటోనే సోషల్ మీడియాలో ఓ రికార్డును అందుకుంది.
కోటి యాభై లక్షలకు పైగా..
హార్దిక్ దిగిన ఆ పోజు.. కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేసింది. గత టీ20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆ ట్రోఫీతో కోహ్లీ ఓ ఫొటో దిగి పోస్ట్ చేయగా.. అది కేవలం ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్‌ను దక్కించుకుంది. కానీ, ఇప్పుడు హార్దిక్ పాండ్య దిగిన పిక్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఆరు నిమిషాల్లోనే మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో కోటీ 60 లక్షలకు పైగా లైక్స్ ను దక్కించుకుంది. దీంతో కోహ్లీ రికార్డును హార్దిక్ పాండ్య బ్రేక్ చేశాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అప్పుడూ ఇప్పుడూ...
కాగా, భారత్ కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ (2002, 2013, 2025) కావడం విశేషం. చివరి సారిగా గత (2017) ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్ చేరినప్పటికీ పాక్ చేతిలో ఓడిపోయింది. ఆ జట్టులో కూడా హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టులోనూ పాండ్య ఉన్నాడు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications