బాబర్ అజామ్ ఔట్.. హార్దిక్ పాండ్య 'బయ్ బయ్' సెలబ్రేషన్స్ (వీడియో వైరల్)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న భారత్ - పాక్ మ్యాచ్ లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ మళ్లీ నిరాశపరిచాడు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో తొలి వికెట్ గా వెనుదిరిగాడు. 26 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. ఈ తొలి వికెట్ ను హార్దిక్ పాండ్య దక్కించుకోవడం విశేషం. అయితే బాబర్ ను ఔట్ చేసినప్పుడు హార్దిక్ పాండ్య బయ్ బయ్ అంటూ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
CELEBRATION BY HARDIK PANDYA AFTER GETTING BABAR AZAM. 🥶 pic.twitter.com/rfEwK32bti
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
సాధారణంగా పాకిస్థాన్ అంటే హార్దిక్ పాండ్య చెలరేగుతాడన్న సంగతి తెలిసిందే. అలానే ఇప్పుడు కూడా తన అద్భుతమైన బౌలింగ్ తో.. వరుస ఫోర్లతో ఊపు మీదున్న బాబార్ ను వెనక్కి పంపించాడు హార్దిక్. వేగంగా ఆడుతోన్న బాబర్ ను బోల్తా కొట్టించి మరీ పెవిలియన్ పంపాడు. అంతకుముందు బంతికే బౌండరీ బాది జోరు మీదున్న బాబర్.. ఆ తర్వాత బంతికి కీపర్ కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొమ్మిదో ఓవర్ లో భారత్ కు ఈ వికెట్ దక్కింది. దీంతో పాకిస్థాన్ 9 ఓవర్లలో 47/1 స్కోర్ చేసింది.
Hardik Pandya saying 'Bye, Bye' to Babar Azam. 😂🔥 pic.twitter.com/3hCfP4YHRe
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025

అక్షర్ పటేల్ కళ్లు చెదిరే త్రో - ఇమామ్ రనౌట్
ఇదే మ్యాచ్ లో పాకిస్థాన్ మరో వికెట్ కూడా కోల్పోయింది. రన్ తీసేందుకు ప్రయత్నించిన ఇమామ్(26 బంతుల్లో 10).. అక్షర్ పటేల్ సూపర్ త్రో కారణంగా రనౌటయ్యాడు. దీంతో నిరాశగా పెవిలియన్ కు వెనుదిరిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications