Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PHOTOS: కుటుంబానికి దూరంగా లండన్‌లో పాండ్యా 26వ పుట్టినరోజు

Hardik Pandya celebrates 26th birthday away from family and friends as he recovers from back surgery in London

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా శుక్రవారం(అక్టోబర్ 11)న 26వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. అయితే, పాండ్యా తొలిసారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరంగా తన పుట్టినరోజుని జరుపుకోవడం విశేషం. ఇటీవలే పాండ్యాకు లండన్‌లో వెన్నునొప్పి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.

అక్టోబర్ 5న పాండ్యాకు లండన్‌లో వెన్నునొప్పి గాయానికి వైద్యులు విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్‌, ట్రైనర్స్‌ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటూ ఓ వీడియోని పోస్టు చేశాడు. అందులో తొలుత నెమ్మదిగా నడవడం ప్రారంభించిన హార్దిక్‌ పాండ్యా ఆ తర్వాత కాసేపు వీల్‌చైర్‌లో తిరిగాడు.

ఈ వీడియోని పోస్టు చేసి "బేబి స్టెప్... పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి నా ప్రయాణం మొదలైంది. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు" అంటూ హార్టిక్‌ ఆ వీడియోని పోస్టు చేస్తూ కామెంట్ పెట్టాడు. దీంతో హార్దిక్‌ పాండ్యా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రార్ధిస్తున్నారు.

శుక్రవారం పాండ్యా తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తోన్న ఫోటోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. పాండ్యా పుట్టినరోజుని పురస్కరించుకుని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Story first published: Friday, October 11, 2019, 14:02 [IST]
Other articles published on Oct 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+