ఎవరో చూడండి: బర్త్ డే రోజున పాండ్యా కుటుంబంలోకి కొత్త మెంబర్


హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గురువారం 25వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పాండ్యాకు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లతో పాటు బీసీసీఐ, ముంబై ఇండియన్స్ సైతం పాండ్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి.
అయితే, తన పుట్టినరోజు సందర్భంగా పాండ్యా తన ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్టు తెగ వైరల్ అవుతోంది. "నా పుట్టినరోజు సందర్భంగా మా కుటుంబంలోకి కొత్త మెంబర్ కలవబోతున్నారు. స్థిరమైన, పర్యావరణానికి అనుకూలమైన బెంట్లే పాండ్యాకు స్వాగతం. ఇక ప్రతీ సారీ పుట్టిన రోజు వేడుకలు మేం కలిసి జరుపుకుంటాం" అని తాను పెంచుకోబోతున్న శునకం ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు.
ఇటీవల ముగిసిన ఆసియాకప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు గాయమైన సంగతి తెలిసిందే. వెన్నెముక గాయంతో భాదపడుతున్న పాండ్యా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. త్వరగానే కోలుకొని ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వస్తానని పాండ్యా ఆశాభావం వ్యక్తం చేశాడు.
2016లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ సందర్బంగా అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన పాండ్యా, అతి తక్కువ కాలంలోనే మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హార్ధిక్ పాండ్యా టీమిండియా తరుపున 35 టీ20లు, 42 వన్డేలు, 11 టెస్టులు ప్రాతినిథ్యం వహించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications